Friday, February 23, 2024
Homeవార్తలురూ.2.60కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

రూ.2.60కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

▪️SDF రూ.2 కోట్లు.. SUDA రూ.60 లక్షలతో పనులు

▪️నగరాభివృద్దిలో భాగంగానే కోట్ల రూపాయలు నిధులు మంజూరు.

ఖమ్మం జులై 18(జనవిజయం):

ఖమ్మం నగరంలో SDF, SUDA నిధులతో చేపట్టిన పలు అభివృద్ది పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  మంగళవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఖమ్మం నగరంలో ఎన్నడూ విధంగా ప్రతి డివిజన్ లో ప్రజలకు అన్ని మౌళిక వసతులు కల్పిస్తున్నామని, కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ది చేసుకున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రకటించిన SDF నిధుల నుండి మంజూరు చేసిన రూ.50 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 32 కిలోమీటర్ల మేర సీసీ కాల్వలు నిర్మిస్తున్నామని వివరించారు.SDF నిధులు రూ.2కోట్లతో CC డ్రెయిన్లకు శంకుస్థాపన, SUDA నిధులు రూ.60లక్షలతో CC రోడ్స్ నిర్మాణ పనులకు గాను మొత్తం రూ.2.60కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను నేడు ప్రారంభించడం జరిగిందన్నారు.

నగరంలోని 12వ డివిజన్ వరదయ్య నగర్-1 లో SDF నిధులతో రూ.90లక్షలతో నిర్మించనున్న CC సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.16వ డివిజన్ దంసలాపురంలో SDF నిధులు రూ.1.10 కోట్లతో నిర్మించనున్న CC డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.23వ డివిజన్ SP ఆఫీస్ రోడ్డులో SUDA నిధులు రూ.20 లక్షలతో VDF టెక్నాలజీతో నిర్మించిన CC రోడ్స్ ను ప్రారంభోత్సవం చేశారు.44వ డివిజన్ బస్ డిపో రోడ్ లో SUDA నిధులు రూ.20లక్షలతో VDF టెక్నాలజీతో నిర్మించిన CC రోడ్స్ ను ప్రారంభోత్సవం చేశారు.7వ డివిజన్ ఖనాపురం ప్రభుత్వ పాఠశాల వద్ద SUDA నిధులు రూ.20లక్షలతో VDF టెక్నాలజీతో నిర్మించిన CC రోడ్స్ ను ప్రారంభోత్సవం చేశారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ ఎంఈ కృష్ణలాల్ , డిఈ లు స్వరూపరాణి, నవ్య జ్యోతి, రంగా రావు, AMC చైర్మన్ దొరేపల్లి శ్వేత, కార్పొరేటర్లు చిరుమామిళ్ళ లక్ష్మి నాగేశ్వర రావు, మేడారపు వెంకటేశ్వర్లు, మక్బూల్, పాలెపు విజయ, నాగండ్ల కోటి, దండా జ్యోతి రెడ్డి, నాయకులు పగడాల నాగరాజు, బ్రహ్మ రెడ్డి, సత్యాల మధు, అంజిరెడ్డి, బిక్షం, లింగనబోయిన లక్ష్మణ, హనుమాన్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments