జనవిజయంతెలంగాణరైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి

రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి

  • తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఖమ్మం జిల్లా కమిటీలు

ఖమ్మం, జూన్ 5(జనవిజయం): రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిరసనగా జాతీయ స్థాయిలో తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని జీవో కాపీలను దగ్ధం చేశారు. శనివారం నాడు తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం సుందరయ్య భవన్లో  ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ లు మాట్లాడుతూ గత సంవత్సరం జూన్ 5న రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి భారతదేశ వ్యవసాయాన్ని కార్పొరేట్ వాళ్లకు అప్ప చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని వారు విమర్శించారు. 200 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో మొక్కవోని దీక్షతో రైతులు ఆందోళనలు నిర్వహిస్తుంటే నేటికీ బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ చట్టాన్ని వెనక్కి తీసుకోకుండా రైతు సంఘాల మీద నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని, అక్రమ కేసులు పెట్టడాన్ని వారు ఖండించారు. ఇప్పటికైనా భారత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్, డివైఎస్ఏ జిల్లా కార్యదర్శి షేక్ బషీర్, ఎస్ఎస్ఏ జిల్లా కార్యదర్శి అశోక్, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు షేక్ మీరా సాహెబ్, ప్రతాప్ నేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి