- అధ్యక్ష, కార్యదర్శులగా దోసపాటి,చిల్లగుండ్ల ఎన్నిక
- పెరిగిన హమాలీ కార్మికుల కూలీ రేట్లు
వేంసూరు,జూలై,30(జనవిజయం):పరిధిలోని మర్లపాడు గ్రామ కిరాణా వ్యాపారుల సంఘం నూతన కమిటి ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మర్లపాడు గ్రామంలో జరిగిన కిరాణా వ్యాపారుల సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులుగా దోసపాటి ఆంజనేయులు,కార్యదర్శిగా చిల్లగుండ్ల జయచంద్ర,గౌరవ అధ్యక్షులుగా నడిపల్లి వాసు దేవరావు(చిన్నబుజ్జి)లు ఎన్నికయ్యారు.అనంతరం హమాలీ కార్మికుల కూలీ ధరలను గతంలో ఇస్తున్న దానికి 10 శాతం పెంచుతూ సీఐటీయూ అనుబంధ మర్లపాడు ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ తో ఒప్పందం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్,కిరాణా వ్యాపారులు నడిపల్లి వెంకట నరసింహo(కన్నయ్య),దోసపాటి చక్రధర్ రావు, అక్కినేని రామకృష్ణ,దోసపాటి శ్రీనివాసరావు,కొత్తా కార్తీక్,దోసపాటి మురళీకృష్ణ,హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పర్శా అప్పారావు,గజ్జెల్లి సత్యం,కనపర్తి కృష్ణ,కోడి గంటి నాగరాజు,కనమాల నాగు,దారా వీరయ్య,ఈడా రామారావు,గోపి,నడ్డి ప్రసాద్,యామవరపు శ్రీను,కనపర్తి జోజి తదితరులు పాల్గొన్నారు.

