Saturday, February 24, 2024
Homeవార్తలుఅసెంబ్లీకి ప్రజా పోరాటాల సారథులు సీపీఎం అభ్యర్ధులను పంపించండి....త్రిపుర మాజి ముఖ్యమంత్రి సీపీఎం పొలిట్ బ్యూరో...

అసెంబ్లీకి ప్రజా పోరాటాల సారథులు సీపీఎం అభ్యర్ధులను పంపించండి….త్రిపుర మాజి ముఖ్యమంత్రి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ పిలుపు….

ప్రశ్నించే గొంతుక సీపీఎం యర్రా.శ్రీకాంత్ కి ఓటేయండి.

అసెంబ్లీకి ప్రజా పోరాటాల సారథులు సీపీఎం అభ్యర్ధులను పంపించండి….త్రిపుర మాజి ముఖ్యమంత్రి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ పిలుపు….

ప్రశ్నించే గొంతుక సీపీఎం యర్రా.శ్రీకాంత్ కి ఓటేయండి.

-సీపీఎం రాష్ట్ర నేత పోతినేని.సుదర్శన్.

-యర్రా శ్రీకాంత్ విజయన్ని కాంక్షిస్తూ రోడ్ షో.భారీ మోటర్ సైకిల్ ర్యాలీ,వందలాదిగా తరలివచ్చిన ప్రజలు.

-ఖమ్మం త్రిటౌన్ లో సీపీఎం రోడ్ షో కి, భారీ ర్యాలీకి అపూర్వ స్పందన

   ఖమ్మం, నవంబర్ 24(  జనవిజయం)    :వచ్చే తెలంగాణ ఎన్నికలలో ప్రజా పోరాటాల సారథులుగా పోటీలో ఉన్న సీపీఎం అభ్యర్ధులను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని త్రిపుర మాజి ముఖ్యమంత్రి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజల పక్షాన పోరాడే సిపిఎం అభ్యర్ధి యర్రా.శ్రీకాంత్ గారిని గెలిపించాలని సీపీఎం రాష్ట్ర నేత పోతినేని.సుదర్శన్ కోరారు.

స్థానిక ఖమ్మం త్రి టౌన్ లో సిపిఎం అభ్యర్థి యర్రా శ్రీకాంత్ విజయన్ని కాంక్షిస్తూ రోడ్ షో.భారీ మోటర్ సైకిల్ ర్యాలీ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ రోడ్ షో కి ముఖ్య అతిథిగా మాణిక్ సర్కార్ పాల్గొన్నారు.ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర జరిగిన రోడ్ షో కి, భారీ ర్యాలీకి అపూర్వ స్పందన వచ్చింది.రోడ్డు పొడవున సీపీఎం శ్రేణులు పూలతో ఘన స్వాగతం పలికారు.రోడ్ షో గాంధీ చౌక్ లో ప్రారంభమై గాంధీ నగర్,పంపిగ్ వెల్ రోడ్, సుందరయ్య నగర్, టింబర్ డిపో రోడ్, మార్కెట్ రోడ్ మీదుగా బోస్ బొమ్మ సెంటర్ వరకు నిర్వహించడం జరిగింది.అనంతరం బోస్ బొమ్మ సెంటర్ లో సీపీఎం త్రి టౌన్ కార్యదర్శి భూక్యా.శ్రీను అధ్యక్షతన జరిగిన సభలో మాణిక్ సర్కార్ మాట్లాడుతు దేశంలో బీజేపీ పాలనలో ప్రజలు ఇసుగెతీపోయారని,నిరుద్యోగం తీవ్రత, ధరల పెరుగుదల ఇంకా అనేక రకాలుగా ప్రజలను పిల్చుకుతినారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ ఎన్నికలలో ప్రజలు చేతన్యని ప్రదర్శించాలని, నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతున్న సీపీఎం అభ్యర్ధులకు ఓట్లు వేసి గెలిపించాలని అసెంబ్లీకి పంపించాలని ఆయన ప్రజలకు పిలుపనిచ్చారు.ఈ సందర్బంగా సీపీఎం రాష్ట్ర నేత పోతినేని.సుదర్శన్ మాట్లాడుతూ ఖమ్మంలో రెండు కార్పొరేట్ శక్తులు ఎన్నికలలో డబ్బుతో గెలవాలని చూస్తున్నారని,వారు ఎప్పుడైన కార్మికుల,ప్రజా సమస్యలపై పోరాడేరా అన్ని ప్రజలు ఆలోచించి నిత్యం ప్రజల కోసం కార్మికుల, ప్రజల కోసం పనిచేస్తున్న సీపీఎం పార్టీకి, యర్రా.శ్రీకాంత్ ని గెలిపించాలని ఆయన కోరారు.సభలో సీపీఎం అభ్యర్ధి యర్రా.శ్రీకాంత్ మాట్లాడుతూ నేను గత 35 సంవత్సరాలుగా కార్మిక ఉద్యమంలో వారి సమస్యలపై పోరాడుతూ,ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు.గత నలభై ఐదు సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీలో ఉంటూనే అనేక పోరాటాలు ప్రజల సమస్యల కోసం కృషి చేశానని,అనేక నిర్బంధాలు,కేసులను సైతం ఎదుర్కొని పనిచేస్తున్నానని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుంటే వాటికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించిందన్నారు అందుకే సీపీఎంకి నాకు ఓటేయండనీ,అందుకనే ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానని,నన్ను గెలిపిస్తే అసెంబ్లీ వేదికగా కార్మికుల,ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడుతానని,కావున మీరందరూ నాకు ఓట్లు వేసి గెలిపించలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న.నాగేశ్వరరావు,సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. విక్రమ్, సీపీఎం కార్పొరేటర్లు యర్రా.గోపి, య ల్లంపల్లి వెంకట్రావ్,సీపీఎం జిల్లా నాయకులు యర్రా.శ్రీనివాసరావు, యం.ఏ జబ్బార్, దొంగల.తిరుపతిరావు,తుమ్మ విష్ణువర్ధన్,పిన్నింటి రమ్య,బండారు.రమేష్,యకయ్యా,యస్. నవీన్ రెడ్డి,చింతల.రమేష్,తుడుం ప్రవీణ్, వై.శ్రీనివాసరావు,త్రీ టౌన్ నాయకులు వాజినేపల్లి.శ్రీనివాసరావు, యర్రా.రమేష్,పత్తిపాక.నాగసులోచన, యస్.కే సైదులు,.ఖాసిం,శీలం.వీరబాబు, ,బి.చౌదరి,పాపారావు, ఎస్ కే బాబు పోతురాజు జార్జి ఎస్.కె కాసిం సిఐటియు నాయకులు ఎర్ర మల్లికార్జున్ పావురాల నాగేశ్వరరావు సారంగి రమణ జంగం నగేష్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments