జనవిజయంతెలంగాణరెమ్‌డెసివర్‌ పేరుతో నకిలీ ఇంజక్షన్‌

రెమ్‌డెసివర్‌ పేరుతో నకిలీ ఇంజక్షన్‌

డాక్టర్‌ మోసాన్ని గుట్టురట్టు చేసిన పోలీసులు

ఖమ్మం,మే19(జనవిజయం): కరోనా మహమ్మారితో ప్రజలు ఓ వైపు ఛస్తుంటే.. ఇదే అదనుగా కొందరు మోసగాళ్లు అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ పేరిట.. ఓ డాక్టర్‌ మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలో బాలాజీ ఛెస్ట్‌ ఆసుపత్రిలో నకిలీ ఇంజక్షన్‌ తో జనాలను మోసం చేసేస్తున్నారు. ఓ పౌడర్‌ మెడిసిన్‌ లో గ్లూకోజ్‌ వాటర్‌ కలిపి ఇంజక్షన్‌ ఇస్తున్నాడో ఓ డాక్టర్‌. ఈ ఇంజక్షన్‌ తీసుకున్న తమ బంధువు చనిపోయాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ డాక్టర్‌ మోసం వెలుగులోకి వచ్చింది. డాక్టర్‌ నిర్వాకం బయట పడడంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ వాడకం ప్రాధాన్యత పెరిగిపోయింది. ఈ ఇంజక్షన్‌ బ్లాక్‌ మార్కెట్‌ లోకి తరలించకుండా ఉండేందుకు అధికారులు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ఉక్కుపాదం మోపుతున్నా..అక్కడకక్కడ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఖమ్మంలోని బాలాజీ ఛెస్ట్‌ ఆసుపత్రిలో వాడి పడేసిన ఇంజక్షన్‌ లో పౌడర్‌ ను, గ్లూకోజ్‌ వాటర్‌ కలిపి రోగులకు ఇస్తున్నాడు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ డాక్టర్‌ను పోలీసు అదుపులోకి తీసుకున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి