- ఎంఆర్ఎఫ్ టైర్లు అత్యంత నాణ్యత ప్రమాణాలతో తయారు చేయబడతాయి
- షోరూంను ప్రారంభించిన సౌత్ డి వి ఎం ఈశ్వర్ పి ఇతనాల్
ఖమ్మం, జూలై 19 (జనవిజయం):
ఖమ్మం నగరంలోని శ్రీ శ్రీ సర్కిల్లో ఎంఆర్ఎఫ్ న్యూ రాఘవేంద్ర టి&ఎస్ షోరూమ్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి ఎంఆర్ఎఫ్ కంపెనీ నుండి ముఖ్య అతిథిగా సౌత్ డివియం ఈశ్వర్ పి ఇతనాల్, డిస్టిక్ మేనేజర్ వరంగల్ వై. రవికిరణ్ హాజరయ్యారు. వీరిని శాలువాలతో ఎంఆర్ఎఫ్ షోరూమ్ యజమానులు రామారావు, రాజేష్ లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. ఇప్పటివరకు ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్స్ అమ్మకం మాత్రమే జరుగుతుందని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సర్వీస్ ని కూడా ఈ షో రూమ్ నుంచి అందించడం జరుగుతుందన్నారు. సర్వీస్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని కానీ కస్టమర్లకు ఎంఆర్ఎఫ్ సేవలు మరింత విస్తృత పరిచేందుకు ఈ షోరూం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
మిషనరీ అంతా యూఎస్ నుండి దిగుమతి చేసుకొని ఈ షో రూమ్ లో అందుబాటులో ఉంచడం జరిగింది అన్నారు. టెక్నాలజీ పరంగా అత్యధిక పరిజ్ఞానంతో టైర్ల మన్నిక ఎక్కువ కాలం వచ్చే విధంగా ఇక్కడ ఫిట్మెంట్ జరుగుతుందన్నారు. కారు కస్టమర్లు ప్రతి ఒక్కరు 5000 కిలోమీటర్లకు తప్పనిసరిగా అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ చేయించుకోవాలని అలా చేయించుకోవడం వలన 25 శాతం ఫ్యూయల్ మెయింటెనెన్స్ తో పాటు టైర్ మన్నిక పెరుగుతుందన్నారు.100 శాతం రేడియల్ టైర్లు ఎంఆర్ఎఫ్ లో అన్ని రకాల అందుబాటులో ఉన్నాయన్నారు. 1999లో ఎంఆర్ఎఫ్ స్టార్ టాప్ కంపెనీ అని ఇప్పుడు దేశవ్యాప్తంగా 925 టీ&ఎస్ షోరూంలు ఎంఆర్ఎఫ్ ప్రారంభించింది అన్నారు.
ఈ షో రూమ్ లో మష్రూమ్ ప్యాచ్ వాడతారని ఇది ఎక్కడ బయట దొరకదని ఒక ఎంఆర్ఎఫ్ లో మాత్రమే దొరుకుతుంది అన్నారు. మష్రూమ్ ప్యాచ్ వాడటం వలన పంచరవుతుందనే భయం ఉండదన్నారు. కస్టమర్లు నైట్రోజన్ గాలి మాత్రమే టైర్లలో నింపాలని నైట్రోజన్ నింపడం వలన టైరు మన్నికతో పాటు, వేడెక్కటం జరగకుండా మైలేజ్ కూడా పెరుగుతుంది అన్నారు. ఈ సందర్భంగా న్యూ రాఘవేంద్ర ఎంఆర్ఎఫ్ షోరూమ్ యజమానులు రామారావు, రాజేష్ లను వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేల్స్ అండ్ టెక్నికల్ ఇంజనీర్, ఖమ్మం ఎంఆర్ఎఫ్ ఇంచార్జ్ మఠం సాయికిరణ్, సేల్స్ అండ్ టెక్నికల్ ఇంజనీర్ శివారెడ్డి ,టెర్రిటరీ ఎగ్జిక్యూటివ్ ధీపక్, విజయ్, ఫీల్డ్ సర్వీస్ ఇంజనీర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.