జనవిజయంతెలంగాణఖమ్మం జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించాలి - సీ.ఎం కేసీయార్ ఆదేశం

ఖమ్మం జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించాలి – సీ.ఎం కేసీయార్ ఆదేశం

ఖమ్మం, మే21(జనవిజయం): ఖమ్మం జిల్లాల్లో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లాలో కోవిడ్-19 పాజిటీవ్ కేసులు, ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్స్ లభ్యత, ఆసుపత్రులలో పరిశుభ్రత, కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్స అందించడం, ఇంటింటి సర్వే ప్రక్రియ, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి పోలీసు అధికారులతో వరంగల్ కలెక్టరేట్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి సమీక్షించి పలు ఆదేశాలు చేసారు. రాష్ట్రానికి ఆర్ధికంగా వేలకోట్లలో నష్టం సంభవిస్తున్నప్పటికి రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కొరకు కోవిడ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్రంలో గత పదిరోజులుగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నామని దీన్ని ఈ నెల 30 వరకు పొడిగించడం జరిగిందని, జిల్లా స్థాయిలో నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలు, సిబ్బంది మినహా రోడ్లపై ఎటువంటి జనసంచారం ఉండరాదని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో కోవిడ్ వైద్య సేవలకు సంబంధించిన ఆక్సిజన్ బెడ్లు, ఇంజక్షన్లు, ఇతర ఔషధాలు సరిపోను నిల్వలు ఉంచుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోను కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవల్లో ఎటువంటి ఇబ్బంది తలెత్తరాదని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రధానంగా కోవిడ్ వార్డులలో పేషెంట్లకు ఆరోగ్యవంతమైన వాతావరణం ఉండాలని తదనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఆసుపత్రుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆరోగ్యవంతమైన వాతావరణం ఉంటే రోగులకు అందిస్తున్న వైద్య సేవల ద్వారా త్వరగా కోలుకుంటారని ప్రతి ప్రభుత్వ వైద్యశాలల్లో కోవిడ్ పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో సేవలు అందించడంతో పాటు మనోధైర్యం కల్పించాలని ముఖ్యమంత్రి తెలిపారు. కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన ఇంటింటి సర్వే రెండవ విడతను కూడా త్వరగా పూర్తి చేయాలని ఇట్టి ప్రక్రియ ద్వారా లక్షణాలు కలిగిన వారు ఇంటి వద్దనే చికిత్స పొందేవిధంగా అవసరమైన ఔషధాలను అందించడం వల్ల కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగామన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీల పరిధిలో కూడా రెండవ విడత సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి రాబోయో పది రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ జిల్లాలో లాక్ డౌన్ అమలు, కోవిడ్ యాక్టివ్ కేసులు, ప్రభుత్వ, ప్రయివేటు వైద్యశాలల్లో ఆక్సిజన్ నిల్వలు, ఇంజెక్షన్ల లభ్యత, ఇంటింటి సర్వే ప్రక్రియను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 6 లక్షల 90 వేల 83 గృహాల సర్వే చేయడం జరిగిందని, 11వేల 540 మంది లక్షణాలు కలిగిన వారిని గుర్తించి అవసరమైన 10,272 మెడికల్ కిట్స్ అందించడం జరిగిందని వివరించారు. జిల్లాలో లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతుందని కేవలం వైద్య, అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే ఉదయం 10.00 గంటల తరువాత అనుమతించడం జరుగుతుందని నగరంలోని ప్రధాన కూడళ్ళతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాలలో 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రధానంగా మధిర, సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రాంతాలు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలుగా ఉండడం వల్ల అట్టి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి చెక్ పోస్టుల వద్ద పోలీసు అధికారులతో పాటు వైద్య, రెవెన్యూ అధికారుల బృంధాన్ని కూడా నిరంతరాయంగా విధుల్లో ఉంచడం ద్వారా కోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని లాక్ డౌన్ వల్ల జిల్లాలో గత పది రోజుల నుండి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 75 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేయడం జరిగిందని మిగిలిన 25 శాతం రాబోయే పదిరోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు.వీడియో కాన్ఫరెన్స్ లో పోలీసు కమీషనర్ విష్ణు.ఎస్.వారియర్, ఏ.ఎస్.పి స్నేహ మెహరా, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్.మదుసూధన్, ఏ.సి.పి ప్రసన్నకుమార్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతీ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి