జనవిజయంతెలంగాణఖమ్మంలో అక్రమంగా చికిత్సలు చేస్తున్న మూడు ఆసుపత్రుల సీజ్

ఖమ్మంలో అక్రమంగా చికిత్సలు చేస్తున్న మూడు ఆసుపత్రుల సీజ్

ఖమ్మం, మే23 (జనవిజయం) : ఖమ్మం నగరంలో నిబంధనలకు విరుద్దంగా కోవిడ్ చికిత్సలు నడుపుతున్న మూడు ఆసుపత్రులను సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.మాలతి ఆదివారం రాత్రి తెలిపారు. డాక్టర్ మాలతి తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం నగరంలోని ప్రశాంతి ఆసుపత్రి, న్యూ హోప్ ఆసుపత్రి, గణేష్ ఆసుపత్రులను జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఆకస్మిక తనిఖీలు చేపట్టి సీజ్ అమలు చేయడం జరిగిందని మాలతి తెలిపారు.

ప్రశాంతి ఆసుపత్రిని ఇంతకుముందే తనిఖీచేసి మే19న నోటీసులు జారీచేసి వివరణను అడిగామని, వారికి తగిన సమయం ఇచ్చినప్పటికీ వారిలో మార్పురాకపోవడంతో పాటు 20 బెడ్స్ కోవిడ్ రోగులకు మాత్రమే పర్మిషన్ తీసుకుని దాదాపు 82 మంది కోవిడ్ రోగులకు అసౌకర్యమైన చికిత్సలు అందించడం జరిగిందన్నారు. ఇక్కడ సరిపడా సిబ్బంది, బెడ్స్ వేయడానికి సరైన స్థలం లేకపోవడమేగాక వారి వద్దనుండి ఫీజులు ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా విచారణ జరిపించిన తదుపరి ఈ ఆసుపత్రిని సీజ్ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. వైరారోడ్ నందుగల న్యూహోప్ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ లేకపోవడమేగాక కోవిడ్ సెంటర్ పర్మిషన్ లేకుండానే దాదాపు 17 మంది కోవిడ్ రోగులకు చికిత్సలు చేయడం, సరైన సౌకర్యాలు లేకపోవడం, ప్రభుత్వనిబంధనలను పాటించకుండా ఇష్టానుసారం చికిత్సలు అందిస్యూత ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలుచేస్తున్నందున సీజ్ చేయడం జరిగింది. గణేష్ ఆసుపత్రికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు, కోవిడ్ చికిత్సల పర్మిషన్ లేదు. కొత్తగా ఆసుపత్రిని పెట్టి వైరానుండి కోవిడ్ చికిత్సకు వచ్చిన రోగులను అడ్మిట్ చేయించి చికిత్సలు అందిస్తున్నట్లు తమదృష్టికి వచ్చిందని, కనుక ఆకస్మికంగా తనిఖీచేసి ఆసుపత్రిని సీజ్ చేయడం జరిగిందని ఆమె తెలిపారు.

అలాగే అన్ని ప్రైవేటు ఆసుపత్రుల మీద ప్రభుత్వం నిర్థారించిన ఫీజులకంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని, అనేక కంప్లెయింట్స్ వస్తున్నాయనీ, వారందరికీ షోకాజ్ నోటీసులు పంపిస్తామని, మానవతా ధృక్పథంతో ప్రజల ప్రాణాలను కాపాడాలని, నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే తప్పనిసిగా కఠినచర్యలు తీసుకుంటాని ఆసుపత్రుల యజమానులను హెచ్చరించారు. జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యులు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ బి.మాలతి, అడిషినల్ సి.పి.శ్రీ రామానుజం, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సురేందర్, ఐ.యం.ఎ సెక్రటరీ డాక్టర్ ప్రదీప్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుబ్బారావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి