జనవిజయంతెలంగాణకేరళ తరహాలో పేదలను ఆదుకోవాలి - పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్

కేరళ తరహాలో పేదలను ఆదుకోవాలి – పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్

ఖమ్మం, జూన్5 (జనవిజయం): ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ జిల్లా కమిటీల డిమాండ్ చేశాయి. ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఉపాధి పని సంవత్సరంలో 200 రోజులకు పెంచాలని రోజు కూలీ 600 రూపాయలు కేరళ తరహాలో ఇవ్వాలని ఉపాధి పని ప్రదేశాల్లో కరోనా టెస్టులు చేసి కరోనా నివారణ వ్యాక్సిన్ ఇంజక్షన్ పేదల అందరికీ ఉచితంగా ఇవ్వాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ కి డి ఆర్ డి ఓ కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అనంతరం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో కరోనా వల్ల పనులు మందకొడిగా జరుగుతున్నాయని, ప్రజలు కరోనా వ్యాధి వల్ల భయభ్రాంతులకు గురి అవుతున్నారని, వారికి వ్యాక్సిన్ ఇచ్చి కాపాడాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని తెలిపారు. తక్షణం వ్యవసాయ కార్మికులకు ఉచిత వ్యాక్సిన్ అందించాలని, పని ప్రదేశాల్లోనే కరోనా టెస్టులు కూడా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా ఉన్నంతవరకు ప్రతి నెలా ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు 50 కేజీల బియ్యం ఇవ్వాలని, కేరళ తరహాలో 17 రకాల నిత్యావసర వస్తువులు అందజేయాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దళిత గిరిజన నూలు ఉపాధి పని చేసిన గ్రామాలలో మూడు వారాల నుంచి 11 వారాల వరకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తక్షణం జిల్లా అధికారులు జోక్యం చేసుకుని పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పొన్నెకంటి సంగయ్య కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ పాల్గొన్నారు

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి