- రైతులకు, కేంద్ర ప్రభుత్వం వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ఖమ్మం, ఆగష్టు 14 (జనవిజయం): కేంద్ర ప్రభుత్వం వ్రాతపూర్వకంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రైతులు ఆగస్టు 15 జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు అన్నారు, సోమవారం ఖమ్మం సుందరయ్య భవన్లో జరిగిన తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం సంయుక్త సమావేశం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో సుదర్శన్ రావు మాట్లాడుతూ ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కు చట్టబద్ధత కల్పించాలని దేశవ్యాప్తంగా రైతులు రుణమాఫీ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ పై కేంద్ర ప్రభుత్వం వ్రాతపూర్వకంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం పై సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం చేస్తుంది అని అన్నారు అందులో భాగంగా ఆగస్టు 15 జాతీయ జెండా ఆవిష్కరణ, ఆగస్టు 24 ఢిల్లీ లో అఖిల భారత సదస్సు జరుగుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర నాయకులు గోకేనపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి అవుల వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు ఎస్ కె ఖాసిం, సుదర్శన్, నవీన్ రెడ్డి, తకెళ్ళపాటి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.