Tuesday, October 3, 2023
Homeవార్తలుKCR కమ్యూనిస్టు లను దూరం పెట్టారా..?

KCR కమ్యూనిస్టు లను దూరం పెట్టారా..?

ఉద్యమకారుడు కేసీఆర్ మదిలో ఏముందో కాలమే నిర్ణయించాలి

 

KCR కమ్యూనిస్టులను దూరం పెట్టారా..?

 ఖమ్మం, 22 ఆగస్ట్(జనవిజయం):మునుగోడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అదే ఫార్ములా కె సి ఆర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అమలుపరుస్తారు అనుకున్నారు కొంత మంది రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు మేము లేకపోతే కె సి ఆర్ కి కూడా ప్రత్యామ్నాయం లేదనుకుని ఎగిరి గెంతేసినంత ఊహాలోకల్లో విహరించారు సిపిఐ ,సి పి ఎం పార్టీలు.మునుగొడులో బి.ఆర్.ఎస్ పార్టీకి మద్దతు తెలిపినందుకు పెద్ద పెద్ద మాటలే చెప్పారు కమ్యూనిస్టు పార్టీలు.అంతటితో ఆగక, మాకు కొన్ని నియోజకవర్గాలు కావాలంటూ   డిమాండ్ ధోరణీ తో వామపక్ష పార్టీలైన సి.పి .ఐ , సి.పి.ఎం వ్యవహరించారనడంలో సందేహమేలేదు.ఇంకొద్దిగా ముందుకు పోయి ..కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది ఆ పార్టీ కి సపోర్టు చేయడంలో ఫలితంలేదు..అలా చేస్తే మతోన్మాదుల శక్తిని బలోపేతం చేసినవాళ్ళం అవుతాం అని ఓ కొత్త సిద్ధాంతాన్ని ప్రజాలముందుకు తెచ్చి .. బి.జె.పి నే ఈ రాష్ట్రంలో రెండో బలమైన పార్టీ గా ఉందని వాళ్లకు తెలియకుండానే చిత్రీకరించారు.ఈ విషయంలో ఆత్మ విమర్షకి తావే లేదని ఖరాఖండిగా చెప్పారు. మునుగోడు ఎన్నికల అనంతరం కె సి ఆర్ కూడా కమ్యూనిస్టుల పోరాటాలను తన ప్రసంగాల్లో అక్కడక్కడ ప్రస్తావించడంతో వామపక్ష పార్టీలు అయిన సిపిఐ,సిపిఎంలు మరింత ఊహాలోకాల్లోకి నెట్టి వేయబడ్డారు . వారనుకున్న కొన్ని నియోజకవర్గలు కేసీఆర్ కేటాయిస్తారని కూడా ముందస్తు ప్రణాళికలు వేసుకున్నారు.ఉప ఎన్నికల్లో బీజేపీ కి వచ్చిన ఓట్లు కేవలం అభ్యర్థుల వ్యక్తిగత పరపతి తో వచ్చిన ఓట్లు గా కాకుండా బిజెపి పార్టీకి బలంతో వచ్చిన వోట్లుగా వామపక్షాలు భావించడం లో తప్పిదం చేసినట్లుగా అనిపిసిస్తోంది.

         ఇదంతా గమనిస్తున్న రాజకీయ కురువృద్ధుడు, ఉద్యమకారుడు కేసీఆర్..ఈ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీకి బిజెపి ప్రత్యామ్నాయం కాదు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అయ్యే అవకాశం ఉంది అని గ్రహించి..సర్వసాధారణం గా అధికార పార్టీ కి ఉండే వ్యతిరేక ఓటింగ్ ని చీల్చడం కోసం వామపక్ష పార్టీలయిన సిపిఐ,సిపిఎం పార్టీలతో చెలిమి చేయలేదనిపిస్తోంది.అంతేకాదు ప్రత్యక్ష ఎన్నికల ఖర్చులో వామపక్ష పార్టీలు పోటీ పడలేవు అనే భావనలో కూడా కేసీఆర్ ఉండొచ్చు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఎం.ఎల్.ఏ సీట్లకు ప్రత్యామ్నాయం గా ఎం.ఎల్.సి. సీట్లను వామపక్షాలకు కేటాయించే అవకాశం కూడా లేకపోలేదు అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.అంతే కాదు జాతీయ స్థాయిలో మతోన్మాద పార్టీలకు వ్యతిరేక పోరాటంలో భాగంగా వామపక్ష పార్టీలకి ఎం.పి సీట్ల కేటాయింపు లో ప్రాధాన్యత ఇస్తారని మరికొందరి రాజకీయ విశ్లేషకుల అంచనా.ఎదియేమైనప్పటికీ సుదీర్గ రాజకీయ అనుభవమున్న ఉద్యమకారుడు కేసీఆర్ మదిలో ఏముందో కాలమే నిర్ణయించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments