జనవిజయంజాతీయంప్రజలకు కెసిఆర్ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు

ప్రజలకు కెసిఆర్ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు

హైదరాబాద్, మే26(జనవిజయం): గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతి కోసం బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీయమన్నారు. తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు, శాంతి సహనంతో కూడిన అహింసాయుత జీవన విధానం.. వీటిలోని మూలాలు బౌద్ధ వారసత్వం నుంచే అలవడ్డాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఫణిగిరి వంటి బౌద్ధారామాల్లో బయల్పడుతున్న అరుదైన బౌద్ధ చారిత్రక సంపద.. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాలను అల్లుకొని తెలంగాణలో బౌద్ధం పరిఢవిల్లిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని సీఎం తెలిపారు. నాగార్జున సాగర్ లో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ కేంద్రాలను పునరుజ్జీవింపచేసి ప్రపంచ బౌద్ధ పటంలో తెలంగాణకు సముచిత స్థానాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, ప్రగతి కోసం పాటుపడటమే భగవాన్ గౌతమ బుద్ధునికి నిజమైన నివాళి. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగుతోందని అని సీఎం పేర్కొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి