సీఎం కేసీఆర్ ను కలసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 22 (జనవిజయం):
రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ కలసిన వారిలో బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఉమ్మడి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు,పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తదితరులు ఉన్నారు.