- పొంగులేటి సభకు లేని బస్సులు అమిత్ శా కు ఎలా? – సంబాని
- తిరగ బడదాం – తరిమి కొడదాం కరపత్రాలు విడుదల
వేంసూరు, ఆగస్ట్30 (జనవిజయం): కేసీఆర్,మోడీ ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందా అని సంబాని చంద్రశేఖర్ అన్నారు.బుదవారం మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామ శివారులో గల మాధురి మధు ఫంక్షన్ హాల్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్ర శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ ల,కార్యకర్తల సమావేశం జరగగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి,పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు సంబాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నాడు మా నేత పొంగు లేటి శ్రీనివాసరెడ్డి బహిరంగ సభకు అద్దెకు లేని ఆర్టీసి బస్సులు నేడు బీజేపీ అమిత్ షా సభకు ఎలా వచ్చాయని కేసీఆర్ ను ప్రశ్నించారు.ప్రజలు గమనిస్తునే వున్నారని రానున్న ఎన్నికలలో తగిన బుద్ది చెపుతారని అన్నారు.అనంతరం బీజేపీ – బి ఆర్ ఎస్ పార్టీలపై తిరగ బడదాo తరిమి గొడదాం అని కాంగ్రెస్ పార్టీ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీనియర్ నేత,జిల్లా ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి మాట్లాడుతూ పల్లె పల్లెన ప్రజలకు నేటి పాలకులు ప్రజలకు చేసిన అన్యాయాలను వివరిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలపాలని,బీజేపీ,బిఆర్ఎస్ లకు కౌంట్ డౌన్ ఆరంభం అయ్యిందని అన్నారు.అనంతరం జిల్లా,నియోజకవర్గ నేతలు బైరెడ్డి మనోహర్ రెడ్డి, కొండూరు కిరణ్, గోళ్ల అప్పారావు, అట్లూరి సత్యనారాయణరెడ్డి, దగ్గుల రఘుపతిరెడ్డి, పెద్ద బోయిన దుర్గా ప్రసాద్, హలావత్ వేంకటేశ్వర్లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కోట సత్యం, కోట మర్తి సురేష్, ప్రేమలత, బుచ్చాలు, ఇజ్జిగాని మధు, కవిశెట్టివేణు, తుంబూరులక్ష్మారెడ్డి, వసంతరావు, కుక్కపల్లి శ్రీను, అప్పిరెడ్డి, కోటి స్వామి తదితరులు పాల్గొన్నారు.