భద్రాచలం, జూలై 17(జనవిజయం):
ముఖ్యమంత్రి మాటలన్నీ నీటి మీద రాతలు గానే ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తెల్లం వెంకటరావు విమర్శించారు. సోమవారం స్థానిక పొంగులేటి తెల్లం క్యాంపు కార్యాలయం లో జరిగిన కార్యకర్తల సమావేశం లో తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ భద్రాచలంలో గతేడాది సంభవించిన వరదల నేపధ్యంలో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెయ్యి కోట్లు ప్రకటించి నేటికి సరిగ్గా ఏడాది పూర్తిఅయ్యింది అని తెలిపారు. కానీ నేటికీ ఒక్క రూపాయి కూడా భద్రాచలం కు నిధులు ఇవలేదని తెల్లం విమర్శించారు.
2015 లో భద్రాచలం రామాలయం అభివృద్ధి కి ప్రకటించిన 100 కోట్లు లో కూడా ఏ మాత్రం నిధులు మంజూరు చేయలేదు అని అన్నారు. గత ఏడాది వరదలు సంభవించి ఈ ప్రాంతం మొత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆయన గుర్తు చేసేరు. దీంతో కేసీఆర్ భద్రాచలాన్ని సందర్శించి గోదావరి నది కి ఇరువైపులా కరకట్టలు నిర్మించి ముంపు ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన ప్రాంతాల్లో గృహాలు నిర్మిస్తామని చేసిన ప్రకటనలు నీటి మీద రాతలు గానే ఉన్నాయని అన్నారు. కెసిఆర్ మొదటి నుండి భద్రాద్రి పట్ల పూర్తి స్థాయిలో వివక్ష చూపిస్తున్నారని తెల్లం ఆరోపించారు. అధికారులు సైతం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు., రాష్ట్ర ప్రభుత్వకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు. గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించకపొతే డెంగు మలేరియా, వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు.
ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి వరదల నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించాలని తెల్లం డిమాండ్ చేసేరు. ఈ కార్యక్రమంలో పొంగులేటి, తెల్లం వెంకటరావు అనుచరులు రత్నం రమాకాంత్, బాంబోతుల రాజీవ్,ఎండీ నవాబ్, రత్నం రజినీకాంత్, ట్రేడ్ యూనియన్ నాయకులు చుక్క సుధాకర్, మహిళానాయకురాలు జాస్తి గంగా భారతి, పిట్టల లక్ష్మి కాంతం యువజన నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్,మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు.