జనవిజయంతెలంగాణకేసీయార్ కుటుంబం కోసమేనా తెలంగాణ? - భాజపా నేత తరుణ్ చుగ్

కేసీయార్ కుటుంబం కోసమేనా తెలంగాణ? – భాజపా నేత తరుణ్ చుగ్

హైదరాబాద్,జూన్11(జనవిజయం): తెలంగాణలో అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య యుద్ధం జరుగుతోందని, తెలంగాణ వచ్చింది కేసీఆర్, ఆయన కుటుంబం కోసం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉందనీ తెలంగాణ లక్ష్యం వెనక్కి పోయిందనీ భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్ లో భాజాపా ముఖ్యనేతల సమావేశంలో పాల్గొన్న ఆయన సమావేశం అనంతరం శామీర్ పేటలోని మాజీ మంత్రి ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లారు. ” తెలంగాణ కోసం, తెలంగాణ ప్రగతి కోసం గత 20 ఏళ్లుగా ఈటల రాజేందర్ కొట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన విధి మర్చిపోయింది.  ఈటల పోరాటం తెలంగాణ సమాజం కోసం. ఈటల శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. తెలంగాణ వికాసమే భారతీయ జనతాపార్టీ  లక్ష్యం. మాతో కలిసి పోరాటం చేయడానికి ఎంత మంది వస్తే వారందరినీ కలుపుకొని పోతాం. ఉద్యమ కారుడు  ఈటలకి భారతీయ జనతాపార్టీ స్వాగతం పలుకుతోంది” అని తరుణ్ చుగ్ అన్నారు. ఈటెలను కలసిన వారిలో తరుణ్ చుగ్ తో పాటు భాజపా నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, రఘునందన్ రావు, రాజాసింగ్, ఎంపీ సోయం బాపురావు, రామచంద్రరావు, ఏ.చంద్రశేఖర్, వివేక్ తదితరులు ఉన్నారు. బండి సంజయ్ అనారోగ్య కారణాలతో హాజరు కాలేకపోయారు. ఈటెల ఈనెల 14న ఢిల్లీ వెళ్ళి బిజెపిలో చేరతారని, ఈలోగా ఈమెయిల్ ద్వారా స్పీకర్ ఫార్మాట్ లో ఎం.ఎల్.ఏ పదవికి రాజీనామా చేస్తారని సమాచారం. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ మరికొందరు నేతలు భాజపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈటెల బిజెపిలో చేరకుండా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారనీ, ఈటెల కూడా తటపటాయిస్తున్నట్లు కొందరు భావిస్తున్న నేపథ్యంలో తరుణ్ చుగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి