జనవిజయంతెలంగాణకేసీయార్ అవినీతిపై బిజెపి పోరాటాన్ని ప్రజలు నమ్ముతున్నారా?

కేసీయార్ అవినీతిపై బిజెపి పోరాటాన్ని ప్రజలు నమ్ముతున్నారా?

  • ప్రజల్లో విశ్వాసం కలిగించగలగాలి
  • కెసిఆర్ అవినీతిపై ఆధారాలు ఉంటే వెల్లడించాలి
  • బిజెపి ద్వయంపై అప్పుడే భరోసా

తెలంగాణలో బలం పెంచుకుంటున్న బీజేపీ మున్ముందు ఎలాంటి వ్యూహం అనుసరించనున్నదనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కెసిఆర్ అవినీతిపై యుద్ధం అంటూ బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ ప్రకటిస్తున్నా, అలాంటి విషయాలు ఉంటే బహిర్గతం చేస్తేనే ప్రజల్లో విశ్వసనీయత ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా రాష్ట్రంలో అవినీతి జరిగి ఉంటే, లేకపోతే కేంద్ర నిధులను పక్కదారి పట్టించి ఉంటే వెల్లడించాలి. ఇలా వ్యక్తపరిచే వైఖరిపైనే పార్టీ ఎలా ఉండబోతుందన్న దాన్నిబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీ మరింత బలపడుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడం ఒక ఎత్తయితే ప్రజలకు ఎలా మేలు చేయగలరో కూడా చెప్పగలగాలి. నిజానికి బిజెపికి బండికి రెండు చక్రల్లా ఇటు సంజయ్, అటు అర్వింద్ దూకుడు కలిసొచ్చింది. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచేవరకు తెలంగాణలో చాలామందికి తెలియని బండి సంజయ్ ఇవాళ అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఎదిగారు. దుబ్బాకలో, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో మంచి ప్రయత్నమే చేశారు. ఇకపోతే బిజెపి వినురుతున్న సవాళ్లు ఒక ఎత్తయితే చాపికింద నీరులా కెటిఆర్‌ను సిఎం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయిన తాజా పరిణామాలు చెబుతున్నాయి. అంతేగాకుండా ఢిల్లీ పెద్దలు అనుగ్రహిస్తే ఎన్.డి.ఏ లో భాగస్వామ్యం కావడానికి కెసిఆర్ ఉత్సుకతగా ఉన్నారని తెలుస్తోంది. వరుస పరాభవాలను ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మున్ముందు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నారన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

కెసిఆర్ వ్యూహం ప్రకారం కొడుకు సిఎం చేసి, తను కేంద్ర ప్రభుత్వంలో చేరాలని చూస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బండి సంజయ్ అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లడం కూడా అనుమానాలకు తావిస్తోంది. పార్టీ అగ్రనేతలతో ఆయన ఏం చర్చిస్తారన్న ఆసక్తి నెలకొంది. అయితే ఉద్యోగ సంఘాలకు వరాలు ప్రకటించడం చూస్తుంటే కెసిఆర్ వైఖరిలో మార్పు వచ్చిందా అన్న చర్చ కూడా సాగుతోంది. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించడానికి కేసీఆర్ మొగ్గుచూపితే, తెలంగాణ రాజకీయాలపై ఆయన తన పట్టును మళ్లీ బిగించవచ్చు. అలా జరగని పక్షంలో ఆయనకు ఇంటా బయటా సవాళ్లు తప్పవు. జాతీయస్థాయిలో ఢీ కొంటానని ప్రకటనలు చేసినందున బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయనను టార్గెట్ చేయకుండా ఉంటుందా అన్నది కూడా ముఖ్యమే. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి ఎక్కడెక్కడ జరిగింది అని కమలనాథులు ఆరా తీయడం మొదలు పెట్టారని సమాచారం. బలమైన ఆధారాలు లభిస్తే కేసీఆర్ ను కేసుల్లో ఇరికించి మరింత బలహీనపరిచే ఎత్తుగడలకు బీజేపీ నాయకులు పదును పెట్టడం ఖాయం. వీటిని తప్పించుకునేందుకు కెసిఆర్ బిజెపికి చేరువువుతున్నారని ప్రచారం సాగుతోంది. టీఆర్ఎన్-మజ్లిస్ పార్టీల మధ్య నెలకొన్న మైత్రిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణలో పూర్తిస్థాయిలో బలపడాలని కమలనాథులు ఆలోచిస్తున్నారు. రాబోయే మేయర్ ఎన్నికలో టిఆర్ఎన్ ఎలాంటి వ్యూహం అవలంబిస్తార్నది కూడా ముఖ్యం కానుంది. అలాగే బండి సంజయ్ ఏ మేరకు పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళతారన్నది చూడాలి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పరోక్షంగా సందేశాలు పంపడంతో సెటిలర్లు టీఆర్ఎస్ కు ఓటేశారన్న ప్రచారం సాగింది. అటు వైకాపా, ఇటు ఎంఐఎంల సహకారంతో ఈ మాత్రం సీట్లు వచ్చాయని బిజెపి నేతలు నమ్ముతున్నారు. దీంతో ఈ రెండు పార్టీలను టార్గెట్ చేసుకుని బిజెపి రాజకీయ కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంది. మొత్తంగా టిఆర్ఎన్ రాజకీయాలను బిజెపి కూడా నిశితంగా గమనిస్తోంది. దానికి అనుగుణంగా కార్యాచరణ చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే బిజెపి ప్రజల్లో ఎలాంటి భరోసా నింపుతుందన్నదే ముఖ్యం.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి