మణిపూర్ అత్యాచార నిందితులను కఠినం గా శిక్షించాలి
- పిఒడబ్ల్యూ నేత కల్పన
భద్రాచలం, జూలై 22 (జనవిజయం): .
మణిపూరులో మహిళలపై అత్యాచారం, హత్యనిందితులను కఠీనంగా శిక్షించాలనూ ప్రగతి శీల మహిళా సంఘం (పిఒడబ్ల్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కెచ్చెల కల్పన డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలను పరష్కరించటంలో విఫలం చెందిన రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం , కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందుటకు అచ్చటి తెగల మద్య ఘర్షణలు రెచ్చగొట్టటంవల్లనే మణిపూర్ లో మంటలు రగులుతున్నాయని కల్పన ఆరోపించారు .శనివారం అశోక్ నగర్ కానీ, భద్రాచలంలోని సిపిఐ(ఎంఎల్)ప్రజాపంధా కార్యాలయంలో శారద అద్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో కల్పన మాట్లాడారు. మణిపూర్ లో జరుగుతున్న ఘటణలను కల్పన ఖండించారు. నేరస్తులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటనలకు బిజెపి ప్రభుత్వం భాద్యత వహించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ,కార్యక్రమంలో కుమారి, నాగరత్నం, రేవతి, చిన్నతల్లి , జయమ్మ, శాంతక్క, రమ , ఫిర్దోజు, షకిరా , నశీమా ,లక్ష్మీ ,తదితరులు పాల్గొన్నారు.