జనవిజయంతెలంగాణకష్టకాలంలో ప్రజల వెన్నంటి ఉండేది కమ్యూనిస్టులే - పోతినేని సుదర్శన్ రావు

కష్టకాలంలో ప్రజల వెన్నంటి ఉండేది కమ్యూనిస్టులే – పోతినేని సుదర్శన్ రావు

బోనకల్, జూన్4 (జనవిజయం) : కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండేది కమ్యూనిస్టులు మాత్రమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామంలో జరిగన తన్నీరు జగ్గయ్య, బొప్పాల సీతారామయ్యల వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ కష్టసమయంలో ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులు మాత్రమే ప్రజలకు అండగా ఉన్న విషయం తేటతెల్లమయిందన్నారు. తన్నీరు జగ్యయ్య నిత్యం గ్రామం గురించి, గ్రామం అభివ్రుద్ధి గురించి ఆలోచించేవారని, పార్టీకి పనికి వచ్చే కార్యకర్తలను ముందుచూపుతో అంచనా వేసి తీర్చిదిద్దేవారని గుర్తు చేశారు. మొదట బొప్పాల సీతారామయ్య స్తూపం వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నూతనంగా పునర్నిర్మాణం చేసిన తన్నీరు జగ్గయ్య స్థూపం వద్ద పోతినేని సుదర్శన్ రావు సిపిఎం పతాకాలను ఆవిష్కరించారు. తన్నీరు జగ్గయ్య స్థూపానికి పోతినేని సుదర్శన్ రావు, పొన్నం వెంకటేశ్వరరావు, నున్నా నాగేశ్వరరావు, చింతల చెరువు కోటేశ్వరరావు, తన్నీరు జగ్గయ్య కుమార్తె తన్నీరు పావని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కిలారి సురేష్ అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ తన్నీరు జగ్గయ్య ఎంతో ముందు చూపు కలిగిన మంచి కమ్యూనిస్టు నాయకుడు అన్నారు. జీవితాంతం సిపిఎం నిర్మాణం కోసం, ప్రజల కోసం పనిచేసిన గొప్పవ్యక్తి అన్నారు. ఆయన నమ్మిన ఆదర్శాన్ని ఆచరణలో చేసి చూపించే నిబద్ధత కలిగిన మంచి నాయకుడు అన్నారు. ఆయన జీవితమే భవిష్యత్తు తరాలకు  ఒక బాటగా, మంచి మార్గంగా ఏర్పడిందన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ తన్నీరు జగ్గయ్య, బొప్పాల సీతారామయ్యల ఆశయాల సాధన కోసం పోరాటాలు నిర్వహించడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. భారతదేశంలో కేరళ రాష్ట్రం అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లే రెండవ దశ లో కరోనా విశ్వరూపం చూపించడమే కాక మరణాల సంఖ్య అధికంగా ఉందన్నారు. ఒక్కరోజులోనే 14 కోట్ల మంది సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పదవినుంచి దిగిపోవాలని కోరారన్నారు. కరోనా మొదటి దశలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఒక కోటి 60 లక్షల రూపాయలను కరోనా బాధితుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది అన్నారు. ఖమ్మం కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నవారికి  నిత్యం వైద్యులతో వైద్యం చేపిస్తూ  పూర్తి స్థాయిలో మూడు పూటలా  పౌష్టిక ఆహారాన్ని  అందిస్తున్నట్లు  వారు తెలిపారు. టి.డబ్ల్యూ.జే.ఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షులు పల్లా కొండల రావు మాట్లాడుతూ తన్నీరు జగ్గయ్య ఆలోచనలు కొన్ని తరాలు ముందు చూపుతో ఉండేవని, 33 ఏండ్లయినా ఈ గ్రామం ఆయనను మరచిపోవడం లేదంటే ఆయన మంచితనం, పార్టీ, గ్రామం అభివ్రుద్ధికి ఆయన చేసిన సేవలే కారణమన్నారు. చదువురాని వారిని ఎందరినో రాత్రి పాఠశాలల ద్వారా చదువు నేర్పించి, పార్టీ కార్యకర్తలుగా తయారుచేసిన గొప్పనాయకుడు జగ్యయ్య అని తెలిపారు. ప్రతి విషయంలో ఆయన ఆలోచనలు ఎంతో ముందు చూపుతో ఉండేవన్నారు. తన్నీరు పావని మాట్లాడుతూ నాన్న ఇతరులకు సహాయం చేయడంలో ముందుండేవారన్నారు. పార్టీ కార్యక్రమాలలో పని చేసేలా ఆడంబరాలు లేకుండా సాధారణంగా జీవించేలా తమకు నేర్పాడన్నారు. నాన్నను 33 ఏండ్లయినా గుర్తుపెట్టుకుని ఇంత ఘనంగా నివాళులర్పిస్తున్న చొప్పకట్లపాలెం గ్రామానికి సంబంధించి ఏ సహాయం కావాలన్నా తనవంతు సహకారం అందిస్తానన్నారు. తన తండ్రి తనను పెంచిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు సిపిఎం చింతకాని మండల కార్యదర్శి  మడిపల్లి గోపాల్ రావు, తన్నీరు జగ్గయ్య కుమార్తె తన్నీరు పావని, చలమల హరికిషన్ రావు, ఉన్నం వెంకటేశ్వర్లు, బొప్పాల రమేష్, బండి శ్రీనివాసరావు, చలమల అజయ్ కుమార్, బోయినపల్లి పున్నయ్య, బూసి వెంకటేశ్వర్లు, కొండేటి అప్పారావు, పొన్నం హర్షవర్ధన్, నల్లమోతు సాయికుమార్, సిపిఎం, డివైఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ధృవ 16వ జన్మదిన వేడుకలు

ఈ సభలో తన్నీరు జగ్గయ్య మనువడు ధృవ 16వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం విశేషం. తాత వర్ధంతి రోజే మనవడి జన్మదినం కావడంతో ఇదే సభలో ధృవకు సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు స్వీటు తినిపించారు. ఈ సందర్భంగా సభికులందరికీ స్వీట్లు, మామిడి పండ్లు పంచారు. తన్నీరు జగ్గయ్య వర్ధంతి సందర్భంగా గ్రామంలో ట్యాంకర్ తో అన్ని వీధులలో శానిటైజేషన్ చేశారు. గ్రామంలోని కోవిడ్ బాధితులకు సి.పి.ఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మామిడి పండ్లు పంచారు. కోవిడ్ తో బాధపడుతున్న పార్టీ సభ్యుడు చామర్తి కోటయ్యను పార్టీ నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. అవసరమైతే ఖమ్మం లో బి.వి.కె ఆధ్వర్యంలో నడుస్తున్న ఐసోలేషన్ కేంద్రంలో జాయిన్ కమ్మని తెలిపారు. ఇటీవల మరణీంచిన వ్యవసాయకార్మిక సంఘం గ్రామ నాయకుడు మోర్ల వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి