మూడు దశాబ్దాలు దాటిన మరువలేని వ్యక్తి కారం బాబురావు దొర …..ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర….
జనవిజయం,14 మే(దేవిపట్నం): ఆదివాసి గిరిజన ప్రజల గుండెల్లో చైతన్యం నింపిన ఆదివాసి నాయకుడు మరణించి నేటికి మూడు దశాబ్దాలు దాటిన మరుపురాని వ్యక్తి కారం బాబురావు దొర అని దేవీపట్నం మండలం వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్ మరియు శరభవరం,దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర అన్నారు.
ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,దేవారం గ్రామ పంచాయతీలోని పోతవరం గ్రామంలో ఉన్న రామాలయం వద్ద జరిగింది.
కారం బాబురావు దొర 33 వ వర్ధంతి వేడుకలు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల లేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ ఆనాడు ఆదివాసి గిరిజన ప్రజలకు ఆదివాసి చట్టాలు,హక్కులపై చైతన్యం కల్పించిన మొదటి తరం ఆదివాసి నాయకుడు అన్నారు.ఆయన వర్ధంతి వేడుకలు మదర్స్ డే నాడు జరుపుకోవడం ఆయన తల్లికే గర్వకారణం అన్నారు.అయిన గుండె ధైర్యం,ధైర్య సాహసాలు,ఆయన త్యాగం నేటి తరం యువతీ యువకులకు స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్, కారం సత్యనారాయణ దొర,కారం రంగారావు,సర్పంచ్ తర్రం రమాదేవి సాంబశివరావు,కారం రణదీప్,కారం భాను,కారం రాంబాబు దొర, కారం జెర్సీ మణి,కుంజం శ్రీనివాస్ దొర, ఇందుకూరుపేట సొసైటీ మాజీ చైర్మన్ తుర్రం రామకృష్ణ దొర,తాటి గంగరాజు,తుర్రం బాలు తదితరులు పాల్గొన్నారు.