బోనకల్, జూలై 16(జనవిజయం) :
మండల పరిధిలో రావినూతల గ్రామానికి చెందిన
వట్టికొండ అప్పారావు, వట్టికొండ జగన్ మోహన్ రావు అతని కుమారుడు వట్టికొండ కార్తీక్ అన్నదమ్ములు మధ్య పొలం కౌలు విషయంలో తలెత్తిన విభేదాలతో ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడం జరిగింది. ఇరువురు స్థానిక పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా ఎస్సై బి సాయికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.