- ప్రభుత్వానికి జెఎసి వినతి
బోనకల్, జూలై 18(జనవిజయం):
ఆరు నెలల కాలం పాటు ప్రజా ప్రతినిధులు,అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి సమస్యలను పరిష్కరించమని కోరిన ఎటువంటి స్పందన లేకపోవడం వలనే గత్యతరం లేక రోడ్లపైకి వచ్చామని ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి జెఎసి నాయకులను చర్చలకు పిలిపించి సమస్యలను పరిష్కరించాలని ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు ప్రభుత్వానికి విన్నవించారు. గత 13 రోజులుగా సమ్మె జరుగుతున్నప్పటకీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. పొలాలలో పనిచేసే వ్యవసాయ కూలీలకు రోజుకు మూడు నుండి ఏడు వందల రూపాయలు వస్తున్నాయన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కేవలం రూ. 280 లే ఇవ్వడం ఏమిటని ప్రశ్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం విడుదల చేసిన కనీస వేతనాల చట్టంలో కనీసం వేతనం రోజుకి రూ. 480 నిర్ణయించిందని, ప్రస్తుతం అదే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు రూ.280 ఇస్తూ కష్టపెడుతుందన్నారు.నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం విడుదల చేసిన జీవో కి కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 16,500, నుండి 21000 వరకు క్యాడర్ల వారీగా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యంతో తోపాటు దురదృష్టవశాస్తూ ఎవరన్నా మరణిస్తే వారికి పది లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 19వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం, 20వ తేదీ నా కుటుంబ సభ్యులతో పోరాట కేంద్రంలో లో నిరసన తెలియజేయడం, 21వ తేదీన జరిగే కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాల్ని జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బోయినపల్లి వీరబాబు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఆకేన పవన్, జేఏసీ నాయకులు మరీ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.