జనవిజయంతెలంగాణజూన్ 17న 'సాహిత్యం-సమకాలినత' అంశంపై సెమినార్

జూన్ 17న ‘సాహిత్యం-సమకాలినత’ అంశంపై సెమినార్

ఖమ్మం కల్చరల్, జూన్ 12(జనవిజయం): జూమ్ మీడియా వేదికగా ఈనెల 17న అక్షరాల తోవ ఆధ్వర్యంలో ‘సాహిత్యం-సమకాలినత’ అంశంపై సెమినార్ జరుగుతుందని అక్షరాల తోవ నిర్వాహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, రాచమల్ల ఉపేందర్ లు శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత సమాజ పరిస్థితులకనుగుణమైన సాహిత్యం రావడం లేదని కొంత మంది సాహిత్య పెద్దలు వాపోతున్నారు.. కవికి గీత గీయడం కూడా సరి కాదని మరికొంత మంది పెద్దలంటున్నారు. వాస్తవమే. కవికి ఎనలేని స్వేచ్ఛ ఉంది. సమాజానికి నాయకుడిగా కవి వ్యవహరించాలి. కానీ కవిపై సమాజ పెత్తనం మాత్రం ఉండకూడదని ఆయన తెలిపారు. కవి నాయకుడు కావాలంటే అనగా సమాజానికి దిక్సూచి కావాలంటే మాత్రం కొన్నింటిని తప్పకుండా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కవి ఉన్న పరిస్థితులు, భౌతిక, సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాలను తన కవిత్వంలోకి చొప్పించాలి. అప్పుడే ఆ కవిత్వానికి సార్ధకత ఉంటుందని చెప్పవచ్చనీ దీనిని ద్రుష్టిలో ఉంచుకునే ‘సాహిత్యం-సమకాలీనత అనే అంశంపై అక్షరాల తోవ ఆధ్వర్యంలో ఈ నెల 17న సెమినార్ నిర్వహించనున్నామని నామా తెలిపారు. ఈ అంశంపై ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందా చారి ప్రసంగం ఇవ్వనున్నారనీ, సదస్సును ప్రముఖ కవి, రచయిత, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ప్రారంభించనున్నారనీ తెలిపారు. 17న సాయంత్రం 5 గంటలకు జూమ్ వేదికగా జరిగే ఈ సెమినార్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సాహితీ పెద్దలను, మిత్రులను కోరారు.

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి