- టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మ జిల్లా కమిటీ వినతి
ఖమ్మం,ఫిభ్రవరి 24 : పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు త్వరగా పరిష్కరించాలని, కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టి, ఉద్యోగుల మాదిరిగా అమలుచేయాలని కోరారు. జర్నలిస్తుల కంట్రిబ్యూషన్ ను ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయడంలో మీడియా అకాడమీ విఫలమైందన్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిందని, వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలుచేయాలని కోరారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలని విజ్ఞప్తి చేశారు. మహిళా జర్నలిస్టులకు పనిచేసే కార్యాలయం నుంచి ఇంటి వరకు రాత్రి పూట రవాణా సదుపాయం కల్పించాలన్నారు. అర్హత ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలు ఎంపానెల్మెంట్లో చేర్చాలని కోరారు. ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజా గ్రీవెన్స్ కు ఎలక్ట్రానిక్ మీడియాను అనుమతించక పోవడాన్ని ఆక్షేపించారు. ప్రజా ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే ఈ పద్ధతి మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల దయనీయ స్థితులను దృష్టిలో పెట్టుకుని వెంటనే సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం ప్రాసెస్ లో ఉందని, దీనిపై ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదనపు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, మోహన్ రావు, బాలకృష్ణ, సహాయ కార్యదర్శులు జక్కంపూడి కృష్ఘ, నాగుల్ మీరా, నాయకులు పారుపల్లి కృష్ణారావు, బంకా వెంకటేష్, వీసారపు అంజయ్య, చేబ్రోలు నారాయణ, జర్నలిస్టులు ఎస్ కే సుభాను, ఉపేందర్, ధనాలకోట రవికుమార్, వేలాద్రి, ఎల్. వీరారెడ్డి, ఇరుగు వెంకటేశ్వర్లు, పడిశాల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.