జనవిజయంఎడిట్జర్నలిజంజర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

– కరోనా బాధిత జర్నలిస్టులకు సహాయం అందించాలి
– టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్

హైదరాబాద్,జూన్21(జనవిజయం) : రాష్ట్రంలో కరోనా కల్లోలానికి చిన్నాభిన్నమైన జర్నలిస్టు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్ లో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అద్యక్షతన జరిగిన సమావేశంలో జర్నలిస్టుల సమస్యలు, ఫెడరేషన్ సంస్థాగత అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. కరోనాతో చనిపోయిన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి పది లక్షల రూపాయిలు సహాయం అందించాలని, పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందిన జర్నలిస్టుల వైద్య ఖర్చులు ఇవ్వాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. అపరీష్కృతంగా వున్న ఇళ్ళస్థలాల సమస్యను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆవిర్భావించి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా దశాబ్ది వేడుకలు జరపాలని, ఇందు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు వేయాలని కార్యవర్గం తీర్మానించింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, వల్లాల జగన్, కార్యదర్శి ఏవీఎన్ రావు, కోశాధికారి ఆర్. వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు కె.పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మరణించిన 73 మంది జర్నలిస్టులకు సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి