వేంసూరు,ఆగస్ట్,9 (జనవిజయం): జర్నలిస్టుల ఇండ్ల స్థలాల పంపిణీ కోసం కృషి చేస్తానని తహశీల్దార్ ఏమ్.ఏ.రాజు తెలిపారు.బుదవారం మీడియా ప్రతినిధులతో రాజు మండల కేంద్రంలోని తహశీల్దార్ చాంబర్ లో మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ప్రజలకు ఉన్న పలు సందేహాలను మీడియా ప్రతినిధులు తెలపగా తహశీల్దార్ స్పందించి సమాధానాలు,పలు సూచనలు చేశారు.
ప్రధానంగా చూస్తే గృహలక్ష్మి పథకంకు దరఖాస్తు చేసుకునే వారికి ఇండ్ల స్థలాల పట్టాలు కాకుండా పసుపు,కుంకుమ పద్దతిలో,మరికొందరు బహుమతి రూపంలో, మరికొందరు విక్రయ రూపంలో పొంది సాదా అగ్రిమెంట్లు రాయించుకొని అనుభవిస్తున్న వారు వున్నారని వారికి ఎటువంటి ప్రభుత్వ దృవీకరణ పత్రాలు,పట్టాలు లేవని వారు గృహలక్ష్మి పథకంకు అట్టి సాదా పత్రాల నకళ్ళూ జతపరిచి దరఖాస్తులు చేయవచ్చా లేదా?,ఈ నెల 10 నుండి 30 వ తేది వరకు దరఖాస్తులు స్వీకరణ గడువు పొడిగించే అవకాశం ఉందా? మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో వుమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కాలంలో సత్తుపల్లి శాసన సభ్యులు జలగం వెంకటరావు కాలంలో ఇండ్లు లేని పేదలకు కడప స్లాబ్ విధానంతో జలగం వెంగళరావు మోడల్ కాలనీ అనే పేరుతో నిర్మించారని అవి ప్రారంభానికి ముందు అనాకా మరికొన్ని కూలీ పోయాయని, కొన్ని బీటలు వారి నివాస యోగ్యంగా లేకపోతే గ్రామంలో అక్కడక్కడ పేదలు తల దాచుకుంటూ జీవనం సాగిస్తున్నారని అట్టి వాటికి పట్టాలు నాడు మంజూరు చేసి పంపిణీ చేయకుంటే ఇటీవల సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో రాస్తారోకో నిర్వహించగా అప్పటి తహశీల్దార్ ముజాహిద్ పట్టాలు పంపిణీ చేశారని, అట్టి పట్టాల జిరాక్స్ లు గృహలక్ష్మి దరఖాస్తులకు జతపరిస్తే గృహలక్ష్మి పథకం వర్తిస్తుందా లేదా? మండల పరిధిలోని కుంచపర్తి గ్రామంలో వుమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రభుత్వం ద్వారా దళిత పేదలకు పెంకుటిల్లు నిర్మించి ఇచ్చి నేటికీ పట్టాలు పంపిణీ చేయలేదని,అట్టి గృహాలు శిధిల మైనాయని వారికి గృహలక్ష్మి పథకం వర్తిస్తుందా లేదా? అని మీడియా ప్రతినిధులు ప్రజల కోసం అడగగా పూర్తి గైడ్ లైన్స్ రాలేదని, ఇట్టి సమస్యలను కలక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేద్దామని తెలిపారు.గత రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న కుల,ఆదాయ,నివాస ధ్రువీకరణ పత్రాల మంజూరు ఎప్పుడు చేస్తారు,ప్రస్తుతం ఎన్ని పెండింగ్ లో వున్నాయి? అని అడగగా రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న వాటిని సత్వరమే పరిష్కారం చేస్తామని, ప్రస్తుతం కుల ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు 255,ఆదాయం కోసం 28,రెసిడెన్స్ కోసం 429 దరఖాస్తులు పెండింగ్ లో వున్నాయని తెలిపారు.
వెంకటాపురం గ్రామానికి చెందిన ఇండ్ల స్థలం కూడా లేని దళిత పేద వికలాంగుడు కనపర్తి కుటుంబరావు
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే అతని పేరుతో గతంలో రెండు పడకల గది ఇల్లు మంజూరు అయినట్లు ఆన్లైన్ లో వుందని ఇండ్ల స్థలం మంజూరు కాదని తెలిపారని అడగగా రీ సర్వే చేసి ఆన్లైన్ లో తప్పుగా నమోదు అయినదని తొలగించాలని,కుటుంబరావు కు ఇండ్ల స్థలం మంజూరు చేయాలని కలక్టర్ కు సిఫారసు చేశామని నెల రోజులలో వివరణ వస్తుందన్నారు.
58 సర్క్యులర్ ద్వారా ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకుని పట్టా పొందిన వారు గృహలక్ష్మి పథకం కు అర్హులని,59 ద్వారా పొందిన వారు అనర్హులని తెలిపారు.కుల, ఆదాయ,రెసిడెన్స్ పత్రాలు లేకున్న కార్యాలయంలో 10 వ తేది వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని,లేని పత్రాల కోసం మీసేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.ఈ నెల 20 న గృహలక్ష్మి దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం గ్రామాలలో అధికారులు పర్యటిస్తారని అనర్హులను తొలగించి అర్హుల జాబితాను పోర్టల్ పొందుపరుస్తాము.ఉన్నత అధికారుల పరిశీలన అనంతరం ఈ నెల 25 న అర్హులకు గృహలక్ష్మి మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో:- గిరిదావార్ హరిప్రసాద్, సీనియర్,జూనియర్ సహాయకులు దూపకుంట్ల జగదీష్,కిరణ్,విజన్ ఆంధ్ర పత్రిక, జన విజయం పత్రిక ప్రతినిధి,యు.ఎఫ్ మీడియా సి.ఈ. ఓ.మల్లూరు చంద్రశేఖర్,తెలంగాణ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రతినిధి నాళ్ల సత్యనారాయణ, మనమే సాక్ష్యం పత్రిక ప్రతినిధి పిల్లి జగన్,మన తెలంగాణ పత్రిక ప్రతినిధి ఏమ్ డి బుర్హానుద్దీన్,వజ్రభారతి పత్రిక ప్రతినిధి ఖమ్మంపాటి మల్లయ్య,డి.వై.ఎఫ్.ఐ.నేత గో దా వీరకృష్ణ లు పాల్గొన్నారు.