- ఈనెల మూడవ వారంలో అక్రిడిటేషన్ సమావేశం నిర్వహించాలని డిపిఆర్ఓ కు ఆదేశం
భద్రాచలం, ఆగష్టు 11 (జనవిజయం): జర్నలిస్టుల సమస్యలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సానుకూలంగా స్పందించారు. శుక్రవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని ఛాంబర్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, రెండవ విడత అక్రిడిటేషన్ల ను నేటికీ అందజేయలేదని పలు సమస్యలను జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఈ నెల మూడవ వారంలో అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలని డిపిఆర్ఓ శ్రీనివాస్ ను ఆదేశించారు. కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అక్రిడిటేషన్ మెంబర్ కర్ర అనిల్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు, కోశాధికారి దొడ్డి హరినాగవర్మ, స్టేట్ కౌన్సిల్ సభ్యులు కటారి కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు డి రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి సాయి సంపత్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, పుష్పగిరి గోపి తదితరులు పాల్గొన్నారు