జనవిజయంక్రీడలుజోసెఫ్ జేమ్స్‌కు 2.5 లక్షల ఆర్ధిక సాయం

జోసెఫ్ జేమ్స్‌కు 2.5 లక్షల ఆర్ధిక సాయం

న్యూఢిల్లీ, మే 19 (జనవిజయం): పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జాతీయ సంక్షేమ పథకం కింద అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ కోచ్ జోసెఫ్ జేమ్స్‌కు యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ (ఎంవైఎఎస్) రూ . 2,50,000 మొత్తాన్ని ఆమోదించింది. కోవిడ్ -19 నేపథ్యంలో మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు, కోచ్‌లకు సాయం అందించేందుకు ఈ ఆర్థిక సహాయం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఎంవైఎఎస్‌లు సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసిన మొత్తం నుండి అందించడం జరిగింది.

2006లో ఆసియా గేమ్స్ బంగారు పతకం మరియు 2008లో జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన జోసెఫ్ జేమ్స్ కొన్ని రోజుల క్రితం కోవిడ్ 19 సోకిన తర్వాత ఏప్రిల్ 24 న తీవ్రమైన శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. అతని ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయి. అతని కుటుంబం ఆయన్ను హైదరాబాద్‌లోని వివేకానంద ఆసుపత్రిలో అత్యవసరంగా చేర్పించాల్సి వచ్చింది. 7-8 రోజులు ఐసియులో ఉన్న అనంతరం ఆయన మే 5 న డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉంది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

సకాలంలో ఆర్థిక సహాయం అందించినందుకు మంత్రిత్వ శాఖ, ఎస్‌ఏఐ, ఐవోఏలకు కృతజ్ఞతలు తెలుపుతూ జోసెఫ్ జేమ్స్ కుమార్తె అలికా జో ఇలా అన్నారు ‘‘తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, ఐవోఏ సభ్యులలో ఒకరైన మహేష్ సాగర్ ఈ ఆర్ధికా సహయం గురించి మాకు తెలియజేశారు. ఆయన దరఖాస్తు అందించగా ఇతర అధికారులు సహకారం అందించారు’’ అని తెలిపారు. ‘‘మా కుటుంబాలు, స్నేహితుల నుండి కూడా మద్దతు పొందడం కష్టంగా ఉన్న ఈ సమయంలో ఇది నిజంగా మంత్రిత్వ శాఖ నుండి గొప్ప సహాయం. మాకు అవసరమైనప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మమ్మల్ని గుర్తు ఉంచుకుని ఆదుకుంది’’ అని ఆమె అన్నారు.

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.జె. యాదవ్ కూడా ఎస్‌ఏఐ, ఎంవైఎఎస్, ఐవోఏలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మిస్టర్ జోసెఫ్‌కు అతని వైద్య ఖర్చులకోసం ఈ ఆర్థిక సహాయం అందించినందుకు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్రంలోని స్పోర్ట్స్ కమ్యూనిటీ తరపున యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, క్రీడలు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు చాలా కృతజ్ఞతలు. ఈ క్లిష్ట సమయాల్లో క్రీడాకారులకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు.’’ అని చెప్పారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి