జోగం నర్సయ్య మృతికి సీపీఐ (ఎం) సంతాపం

0
117

ఖమ్మం, మే 25 (జనవిజయం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల సీపీఐ(ఎం) కార్యదర్శి జోగం నర్సయ్య మృతికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్ తదితరులు సంతాపం తెలిపారు. ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఆయన భౌతికకాయాన్ని పార్టీ నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. నర్సయ్య మృతి సీపీఐ(ఎం) పార్టీతో పాటు, గిరిజన ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాద పార్టీలను ఎదురొడ్డి సీపీఐ(ఎం)ను గుండాల మండలంలో ముందుకు నడిపించిన ఘనత నర్సయ్యదేనని పేర్కొన్నారు. గిరిజనుల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. పోడు ఉద్యమాలు, తునికాకు ధరలు తదితర అంశాలపై సీపీఐ (ఎం) నిర్వహించిన ప్రజా ఉద్యమాల్లో నర్సయ్య కీలకపాత్ర పోషించారని వివరించారు. నర్సయ్య మృతికి జోహార్లర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here