జనవిజయంజాతీయంజితిన్ ప్రసాద్ రాకతో యూపిలో కలసివచ్చేనా?

జితిన్ ప్రసాద్ రాకతో యూపిలో కలసివచ్చేనా?

  • బ్రాహ్మణ వర్గాన్ని దరిచేర్చుకునే యత్నాలు
  • యూపి ఎన్నికల కోసం బిజెపి ముందస్తు వ్యూహాలు

లక్నో, జూన్ 12(జనవిజయం): వచ్చే యేడాది అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరుగనున్నాయి. యోగి సిఎంగా బాధ్యతలు చేపట్టాక అక్కడ బిజెపి తరహా పాలనతో చాలామందికి అది నచ్చి ఉండకపోవచ్చు. మరోమారు అధికారంలోకి రావాలంటే అన్ని వర్గాలను దగ్గరకు చేర్చుకోవాల్సిందే. ముఖ్యంగా యోగీ వచ్చాక బ్రాహ్మణవర్గం దూరమయ్యిందన్న భావన ఏర్పడింది. పన్నెండుశాతం బ్రాహ్మణ ఓటర్లున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారి ఓట్లు ఎంతో కీలకం. గతంలో ఇక్కడ వారిదే రాజ్యంగా ఉండేది. ఈ వర్గం బలమైన వ్యాపారవర్గంగా కూడా ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కు చెందిన జితిన్ ప్రసాదను పార్టీలో చేర్చుకున్నారు. జితిన్ ప్రసాద్ ఏ మేరకు ఉపయోగ పడతారన్నది వచ్చే ఎన్నికల ఫలితాల తరవాతనే చెప్పగలం. యోగి ఆదిత్యనాథ్ దెబ్బకు ఆ సంప్రదాయ ఓటుబ్యాంకు సన్నగిల్లిపోతున్నదని బీజేపీకి బెంగ పట్టుకున్నట్లుగా ఉంది. ఇలా చెప్పడం కంటే మరింత జాగ్రత్తలతో బిజెపి పావులు కదుపుతోందని అనుకోవాలి.

ఏదో ఒకటి చేయకపోతే బ్రాహ్మణుల ఓట్లు పడవనే హెచ్చరికలు వచ్చాయని కూడా భావిస్తున్నారు. వికాస్ దుబే ఎన్ కౌంటర్, అనంతర పరిణామాలు పార్టీకి బ్రాహ్మణులను దూరం చేశాయని కూడా భావిస్తున్నారు. అయోధ్య, వారణాసి స్థానిక ఎన్నికల్లో పార్టీ ఓటమి కూడా ఈ భయాన్ని పెంచింది. జితిన్ ప్రసాద గత ఏడాది బ్రాహ్మణ చేతనా మంచ్ ఆరంభించడం వెనుక బీజేపీ పెద్దల ఆశీస్సులున్నాయని కూడా అంటారు. కాంగ్రెస్ నుంచి వలసవచ్చిన రీటా బహుగుణ జోషి సహా యోగి మంత్రివర్గంలో అరడజను మంది బ్రాహ్మణులే ఉన్నా, పార్టీ పదవుల్లోనూ వారి సంఖ్య బాగానే ఉన్నా, ఆ సామాజికవర్గంపై జితేంద్ర ప్రసాద్ కుటుంబానికి ఉన్న పట్టు, గుర్తింపు బీజేపీకి రాజకీయంగా ఉపకరిస్తుందని అంచనా. తమను అధికారంలోకి తీసుకువస్తే భారీ పరశురామ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చిన ఎస్సీ, బీఎస్పీ అధినేతలు బీజేపీ పాలనలో బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతున్నదని ఇప్పటికే ఎంతో వాపోతున్నారు. రాహుల్, ప్రియాంకలకు సన్నిహితుడైన జితిన్ నిష్మమణ కాంగ్రెస్ కంటే వారిద్దరికీ వ్యక్తిగతంగా నష్టం. ఉత్తర్ ప్రదేశ్ వ్యవహారాల బాధ్యురాలిగా యోగి మీద తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రియాంకకు మరీదెబ్బ. ఈ పరిణామం కాంగ్రెస్ ను మరింత బలహీనపరచినా, సమాజ్ వాదీకి మేలు చేస్తుందని కూడా అంటున్నారు.

మాయావతి పార్టీ మరింత బలహీనంగా ఉన్న తరుణంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు అఖిలేష్ పక్షాన నిలబడ్డారు. ఎన్నికలనాటికి కాంగ్రెస్ మరింత నీరసించిన పక్షంలో, రాష్ట్రంలో నలభై శాతం సీట్లను ప్రభావితం చేయగలిగే ముస్లింలు సమాజ్ వాదీ వైపు పూర్తిగా మళ్ళిపోయే అవకాశమూ ఉంది. అది బీజేపీకి నష్టం చేస్తుంది. ఇరవైయేళ్ళ క్రితం జితిన్ తండ్రి జితేందప్రసాద పార్టీ సంస్థాగత ఎన్నికల్లో సోనియాను సవాలు చేశారు. ఇప్పుడు త్వరలోనే సంస్థాగత ఎన్నికలు జరిగి, రాహుల్ తిరిగి బాధ్యతలు స్వీకరిస్తారని అనుకుంటున్న తరుణంలో జితిన్ పార్టీని విడిచిపెట్టిపోయారు. పదినెలల క్రితం బీజేపీలో చేరబోయి, వెనక్కు తగ్గిన రాహుల్ మరో మిత్రుడు సచిన్ పైలట్ కూడా ఇక ఆగకపోవచ్చు. రాహుల్ మీద ఆశలు పెట్టుకున్న వారికి ఆయనకానీ, పార్టీకానీ మంచికాలం ముందున్నదన్న హామీ ఇవ్వనంతకాలం నిష్మమణలు జరిగిపోతూనే ఉంటాయి. ఇప్పుడు బిజెపిలో చేరడానికి జితిన్ ను అదే ప్రేరేపించి ఉంటుంది. జితిన్ ప్రసాద రాకతో నిజంగానే బిజెపికి లాభం చేకూరుతుందని కాంగ్రెస్ స్థానిక నాయకత్వం కూడా నమ్ముతోంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి