జనవిజయంఆరోగ్యంజీర్ణ వ్యవస్థకు ఎక్కువ సమయం కేటాయిస్తే కలిగే లాభమేమిటో తెలుసా?

జీర్ణ వ్యవస్థకు ఎక్కువ సమయం కేటాయిస్తే కలిగే లాభమేమిటో తెలుసా?

న శరీరంలో రక్షణ వ్యవస్థ ఏ సమయంలో పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఆ సమయంలో శరీరం రిపేర్, క్లీనింగ్ ఏ విధంగా చేస్తుంది. దీనిని మనం శక్తివంతంగా ఉపయోగించుకోవాలంటే మన దినచర్యలో చిన్న మార్పు తీసుకోవడం ద్వారా ఎలా సాధ్యం చేసుకోవచ్చు. మన ఋషులు, పూర్వీకులు ఆచరించి, మంచి ఫలితాలను అనుభవించిన టెక్నిక్ ఇది. దురద్రుష్టవశాత్తు ఈ రోజులలో మన జీవన విధానంలో అలాంటి మంచి అలవాట్లను దూరం చేసుకుంటున్నాము. రోగాలు కొని తెచ్చుకునే కొత్త దురలవాట్లు పెంచుకుంటున్నాము. తెలిసో, తెలియకో పిల్లలకూ అదే అలవాట్లు నేర్పుతున్నాము. ఒకరకంగా మనం రానున్న తరాన్ని నిర్వీర్యం చేస్తున్నాము. అటువంటి ప్రమాదం నుండి బయట పడాలంటే ప్రక్రుతి జీవన విధానంలోని టెక్నిక్స్ ని అందులో ఉన్న సైన్సుని మనం అధ్యయనం చేయాలి. ఒక విషయం గురించిన సమాచారం తెలుసుకుని ఆచరణలో పెట్టి ఫలితాలను సమీక్షించుకుంటే మరో పదిమందికి చక్కగా, ధైర్యంగా చెప్పే అవకాశం ఉంటుంది. అందుకే రాత్రిపూట పెందలాడే భోజనం ముగించడం, మళ్లీ ఉదయం ఆలస్యంగా తినడం…. ఈలోగా నీటితో కడుపుని నింపుతుండడం….. అంటే జీర్ణవ్యవస్థకు ఎక్కువ సమయం కేటాయించగలగడం అనే టెక్నిక్ ని మీరు ఆచరణలో పెట్టగలిగితే డెఫినెట్ గా మీ శరీరం యొక్క సహజ శక్తిని మీరు ఉపయోగంలో పెట్టినట్లేనని మీరు అర్ధం చేసుకోగలుగుతారు. ప్రక్రుతి జీవన విధాన నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఈ విషయంలో ఏమి చెపుతున్నారో దిగువన వీడియోలో తెలుసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ పోస్టును మిత్రులందరికీ షేర్ చేయండి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి