జనవిజయంనాడు-నేడుఆ భరోసా, స్వాంతన, చైతన్యం ఏ యంత్రం ఇస్తుంది...?!

ఆ భరోసా, స్వాంతన, చైతన్యం ఏ యంత్రం ఇస్తుంది…?!

జాతి నిర్మాతలకు ప్రాధాన్యమేది?

గురువుల దృశ్య మాధ్యమ
బోధనా కష్టాలు గమనించారా
ఏళ్ళ తరబడి తరగతి గదే
దేవాలయంగా భావించి
మెరికల లాంటి శిష్యులను
తయారు చేసిన గురువులు
తమ ముందు శిష్యులు లేకుండా
పాఠాలు చెప్పమంటుంటే
మనోధర్మానికి విరుద్ధంగా చేయలేని
వారి మనోవేదన వర్ణనాతీతం
కరోనా తెచ్చిన కృత్రిమ బ్రతుకు
యాంత్రికతకు అలవాటు పడలేక
అంతర్మధనంతో కల్లోల పడుతోంది
యుగాలుగా నడిచిన సాంప్రదాయ విద్య
ప్రపంచాన్ని సమ్మోహనపరిచిన అపూర్వ చేతన
ఆగిపోతుందేమోనన్న ఆందోళన
గురువుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది…
గురువులారా ఆందోళన చెందకండి
ఇదంతా తాత్కాలికమే…మళ్ళీ మనం
పూర్వ వైభవం సంతరించుకుంటాం
విద్యా దేవాలయాలు తెరుచుకుంటాయి.

ఉపాధ్యాయ వృత్తి అనేది మహత్తరమైనది. విద్యార్థిని తీర్చిదిద్దటానికి, వ్యక్తిత్వం, శక్తియుక్తులను పెంపొందిస్తూ భవిష్యత్ ను నిర్మించే గొప్ప వృత్తి..నన్ను అందరూ మంచి అధ్యాపకునిగా గుర్తించటం నాకు గొప్ప గౌరవం. –భారతరత్న అబ్దుల్ కలాం.

శతాబ్దాలుగా తరగతి గదిలో జరిగిన అద్భుత ప్రక్రియకు తాత్కాలిక అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో వచ్చిన ఉపాధ్యాయ దినోత్సవం ఇది. పాఠశాలలు కళాశాలలు మూతపడటంతో ఉపాధ్యాయుల వ్యక్తిగత జీవితాలు తలకిందులు అవ్వటం దురదృష్టకరం. కుటుంబ పోషణ భారం అవడంతో దశాబ్దాలుగా ఎంతో పవిత్ర యజ్ఞంగా సాగించిన ఉపాధ్యాయ వృత్తిని వదిలి కూలి పనులకు వెళ్లడం,కూరగాయలు అమ్మడం వంటి ఉపాధి మార్గాల వైపు మరలటం బాధాకరం.  గురువు అంటే ప్రపంచ గమనాన్ని సమూలంగా మార్చే యజ్ఞకర్త. తరతరాలుగా జాతిని నిలబెడుతున్న నిర్మాత. దురదృష్టమేమిటంటే ప్రపంచ దేశాలు అన్నీ కరోనా నుండి రక్షించుకునే వర్గాలలో ప్రధమ ప్రాధాన్యత ఉపాధ్యాయులకు,అధ్యాపకులకు ఇస్తే మనం ఏమాత్రం వారిని పట్టించుకోకపోవడం.

మనల్ని మనం నిజాయితీగా పరిశీలించుకోవడాన్ని నేర్పే వాళ్ళే గురువులు. –సర్వేపల్లి రాధాకృష్ణన్

విద్యార్థుల యొక్క ప్రతి అడుగులో ఉంటూ వారిలో నిబిడీకృతమై ఉన్న శక్తియుక్తులను వెలికి తీసి సాన పెట్టి ప్రయోజకులుగా తయారు చేయడమే అధ్యాపకుని నిరంతర ప్రక్రియ… నిజాయితీ, నిబద్ధత,సహనం,పట్టుదల,క్రమశిక్షణ నేర్పి వారిపై వారికి నమ్మకం కలిగించే ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం ఏది?

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏ రంగానికి చెందిన అంశాలైనా దొరుకుతాయేమో కాని నేనున్నాను అని వెన్ను తట్టే గురువు చేయి దొరకదు…ఆ స్పర్శ సడలిన విద్యార్ధి ఆత్మవిశ్వాసాన్ని ఉచ్ఛ స్థితికి చేరుస్తుంది.. ఏమీ చేయలేనన్న భావన నుండి ఏదైనా చేయగలననే స్థాయికి తీసుకెళుతుంది.. ఆ భరోసా, స్వాంతన, చైతన్యం ఏ యంత్రం ఇస్తుంది… ఏ సాంకేతికతతో ఆ దూరం పూడ్చగలం… ఆలోచిద్దాం…

గత కొన్ని దశాబ్దాలుగా విద్య వ్యాపార అవకాశం గా మారటం వల్ల ఉపాధ్యాయుని విలువను దిగజార్చింది. కరోనా వల్ల సాంకేతిక సాధనాల హడావిడితో విద్యార్థుల ముందుకు ఆన్లైన్ క్లాసులు, వీడియో క్లాసులు, అసైన్మెంట్లతో గురువుతో ప్రమేయం లేని విద్యను తీసుకువచ్చారు. దీనితో శతాబ్దాలుగా దేశ గమనాన్ని నిలబెట్టిన గురుశిష్య పరంపరకు విఘాతం ఏర్పడింది. చలనం లేని వస్తువును విద్యార్థుల ముందు పెట్టి జీవితాన్ని నిర్మించుకోమనటం ఎంత అసంబద్ధం. బింబ ప్రతిబింబాలుగా ప్రవాహంగా సాగిపోతున్న విద్యా వ్యవస్థకు ఇరుసుగా నిలబడిన ఉపాధ్యాయుడి యొక్క పరిస్థితి ఏమిటి అనేది మనం ఆలోచించవలసిన తరుణమిది.

చదువు అంటే జ్ఞాన జ్యోతి వెలిగించే దీపం..పాత్రను నింపే సరుకు కాదు. –సోక్రటీస్

ఈ మాటలు ఇప్పటి పరిస్థితులకు అతికినట్టు సరిపోతాయి. కేవలం ఆయా సబ్జెక్టులకు మెటీరియల్స్ ఇచ్చి వాటిని చదువుకుంటూ వెళ్లినంత మాత్రాన విద్యార్థికి అన్ని అంశాల మీద అవగాహన రాదు. జీవితానికి సంబంధించిన వాస్తవ ఉదాహరణలను జోడించి హృదయానికి హత్తుకునే విధంగా బోధిస్తేనే ఆ చదువుకు అర్థం పరమార్థం.  ఒక జాతి సమున్నతంగా నిలబడాలంటే ఒకే ఒక సాధనం ఉపాధ్యాయుడు. సాంకేతిక విద్య ఎప్పటికీ ప్రత్యక్ష విద్యావిధానానికి ప్రత్యామ్నాయం కాలేదు. ఎందుకంటే గురుముఖంగా నేర్చుకునే దానికి రూపం, రంగు, రుచి, వాసన ఉంటాయి. భౌతిక వస్తువు ఎప్పటికీ మనసును కదిలించలేదు. విద్యార్థి యొక్క వాస్తవ పరిస్థితిని అనుసరించి అతని శ్రేయస్సు కోరి ఉపాధ్యాయుడు పడే తపన సాంకేతిక విద్య వలన కుంటు పడే అవకాశం ఉంది.

ఉపాధ్యాయుడంటే తన జీవిత కాలంలో వేలాది మంది నిపుణులను, శాస్త్రవేత్తలను, పరిశోధకులను, రాజకీయ నేతలను,దేశానికి సంబంధించిన అన్ని రంగాలకు కావలసిన అపురూపమైన మేధావులను తయారుచేసే గొప్ప వ్యక్తి. ఇప్పుడు జరుగుతున్న ఎంట్రెన్స్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల అభిప్రాయాలను చూస్తే తమ గురువుల ప్రత్యక్ష బోధన లేకపోవడంతో తాము అనుకున్న విధంగా రాణించలేక పోతున్నామని, మంచి మార్కులు తెచ్చుకోలేక పోతున్నామని పేర్కొంటున్నారు. ఇది నిజంగా మనమందరం ఆలోచించవలసిన విషయం.. దీనిని బట్టి చూస్తే ఉపాధ్యాయుడు యొక్క విలువ జాతికి ఎంత కీలకమైనదో అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, సమాజం ఉపాధ్యాయుల విలువను గుర్తించి వారిని సముచితంగా గౌరవించుకుని తమ తమ ప్రథమ ప్రాధాన్యత గా భావించాలని కోరుకుందాం…

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
  • అట్లూరి వెంకటరమణ
    9550776152

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి