హైదరాబాద్ , జులై 31 (జనవిజయం): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్, పార్టీ ఎన్నికల కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ బంజారా హిల్స్ లోని వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసారు. ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి అవలంభిచాల్సిన విధివిధానాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు పొంగులేటి తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుల సలహాలు, సూచనలతో పార్టీ అభివృద్ధికి తనవంతు సేవలను అందిస్తానని పేర్కొన్నారు.