జనవిజయంUncategorizedజానకమ్మ అద్భుత గాత్రం.. జ్వాల సినిమాలోని 'ఏవేవో కలలు కన్నాను'..

జానకమ్మ అద్భుత గాత్రం.. జ్వాల సినిమాలోని ‘ఏవేవో కలలు కన్నాను’..

జానకమ్మ అద్భుత గాత్రంతో పాడిన ఈ పాట జ్వాల(1985) సినిమాలోనిది. సంగీతం: ఇళయరాజా, నటీనటులు: చిరంజీవి, రాధిక, గీతరచయిత: మైలవరపు గోపి …… చిరంజీవి హీరోగా ఎదుగుతున్న రోజులలో వచ్చిన అద్భుతమైన పాట ఇది. ఎన్నిసార్లు విన్నా మనసుకు ఆహ్లాదకరంగా అ(వి)నిపించే ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గోపీ లిరిక్స్ కూడా బాగున్నాయి. సినిమాలో రెండు విడతలుగా వచ్చే ఈ పాటను కలిపి ఒకే చోట ఐడ్రీమ్స్ యూట్యూబ్ చానల్ వారు అందించారు. ఎంబెడెడ్ కోడ్ ద్వారా …. ఇలా మీరూ మరోసారి విని ఆనందించేందుకు, జనవిజయం వీక్షకులకోసం ఇక్కడ ఉంచుతున్నాము. మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియజేయండి.

ఏవేవో కలలు కన్నాను మదిలో
ఏవేవో కలలు కన్నాను మదిలో…
మౌన మురళినై విరహ వీణనై
స్వామి గుడికి చేరువైన వేళలో
ఏవేవో కలలు కన్నాను మదిలో…
చరణం:1
సుడిగాలులలో మినికే దీపం
ఈ కోవెలలో ఎటు చేరినదో
ఏ జన్మలోని బందమో ఇదే రుణానుబందమో…(2)
నీకు నేను బానిసై నాకు నువ్వు బాసటై
సాగిపోవు వరమే చాలు…
ఏవేవో కలలు కన్నాను మదిలో….
చరణం:2
నాకన్నులలో వెలుగై నిలిచి
సిరివెన్నలగా బ్రతుకే మలిచి
నిట్టూర్పుగున్న గుండెకు ఓదార్పు చూపినావురా…(2)
నాది పేదమనసురా కానకలియ్యలేనురా
కనుల నీరే కానకరా…….
ఏవేవో కలలు కన్నాను మదిలో
మౌన మురళినై విరహ వీణనై
స్వామి గుడికి చేరువైన వేళలో…..

జనవిజయంలోని అన్ని తెలుగు హిట్ సాంగ్స్ కోసం ఇక్కడ నొక్కండి.

మీకు తెలిసిన తెలుగు హిట్ సాంగ్స్ కోసం మాకు వ్రాయండి : [email protected]

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి