జనవిజయంఆంధ్రప్రదేశ్జగన్ వైఖరిలో మార్పు రావాల్సిన సమయమిదే

జగన్ వైఖరిలో మార్పు రావాల్సిన సమయమిదే

  • కొంతకాలం రాజకీయ విమర్శలను పక్కన పెట్టాలి
  • ఏపిలో చేస్తున్న అభివృద్ధిపై సమీక్షించుకోవాలి
  • ప్రజల మనోభావాలను తెలుసుకుని ముందుకు సాగాలి
  • అప్పుడే సమర్ధ సిఎంగా జగన్ రాణించగలరు

అమరావతి, జూన్2 (జనవిజయం): ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రజలకు ఏ మేరకు చేరువయ్యారన్నది అర్థం కావడం లేదు. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన కన్నా చంద్రబాబును విమర్శించడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిజానికి తాను చేయదల్చుకున్న అభివృద్ధిపై స్పష్టతతో ముందుకు పోవడం మంచిదే. అయితే అదేపనిగా విపక్ష నేతలను జైళ్లకు పంపడం కోసం కేసులు పెట్టడం, అదేపనిగా విమర్శలు చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకభావం ఏర్పడుతున్న విషయం గమనించడం లేదు. అలాగే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో ఆర్థిక ప్రగతి కుంటుపడుతుందని గమనించడం లేదు. తెలంగాణతో పోలిస్తే ఎపిలో అభివృద్ధి అన్నది అనలు కనిపించడం లేదు. ప్రస్తుతానికి సి.ఎం జగన్ రాజకీయంగా బలంగా ఉన్నారు. కేంద్రంలోని బిజెపి కూడా అనుకూలంగానే ఉంది. అయితే బిజెపిని నమ్మడానికి లేదు. ఎప్పుడు తేడా అనిపించినా జగన్ కేసులను తిరగదోడదన్న నమ్మకం లేదు. చిన్న వయసులోనే జగన్ కు రాజకీయంగా అపూర్వ అవకాశం లభించింది. 50 శాతానికి పైగా ప్రజలు ఓట్లేసి 151 సీట్లలో గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. అయితే ముఖ్యమంత్రిగా ఆయన ఉదాత్తంగా ఆలోచించాలి. ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉండాలి. అలాగే మంచి సలహాలు ఇచ్చే వారిని దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడైనా ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా ముందుకు సాగాలి. అలాగని తాయిలాలు పంచడం కాదు. ఒడిషలాలో నవీన్ పట్నాయకను ప్రజలు ఆరాధించి ఓటు వేస్తున్నారు. గతంలో న్యాయస్థానం తనకు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయాలని రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేసారు. ఇప్పటికి గండం గట్టెక్కేలా ఉన్నా..బిజెపి వంకర చూపు చూస్తే జగన్ కు కష్టాలు మొదలు కావచ్చు. రఘురామ పిటిషన్ వేయడాన్ని జగన్ రెడ్డి సహించలేకపోయి ఉంటారు. ఈ కారణంగానే సీఐడీని ప్రయోగించి రఘురాజును అరెస్టు చేయించారని వస్తున్న ఆరోపణలు నిజమనే ప్రజలు నమ్ముతున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ లభించడంతో మరో కేసులో రఘురామరాజును అరెస్టు చేయించడానికి యత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరహా కక్ష సాధింపులను కొనసాగించినంత కాలం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉండదు. తన బెయిల్ రద్దు కావడానికి జగన్ చర్యలు దోహదపడుతున్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న జగన్ తన పంథాను మార్చుకుంటే ఓ మంచి సిఎంగా మనగలుగుతారు. ఇకపోతే రాయలసీమకు అన్యాయం జరుగుతోందని కొంతమంది నాయకులు గతంలో ఆరోపించేవారు. నిజానికి చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ, తిరుపతి పరిసరాలలో సెల్‌ఫోన్ల కంపెనీలు ఏర్పాటయ్యాయి. కర్నూలు జిల్లాలో కూడా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఇప్పుడు జగన్ రెండేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క ప్రతిపాదన కూడా లేకుండా పోయింది. అయినా అప్పుడు రాయలసీమ వెనుకబాటుతనం గురించి మాట్లాడినవారు, ఉద్యమించినవారు నోరుమూసుకున్నారు. ప్రత్యర్థుల పైకి ఉసిగొల్పడానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎంపిక చేసుకున్న కొద్దిమంది మంత్రులు మినహా మిగతా మంత్రులు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. అధికారులు సైతం పై నుంచి వస్తున్న ఆదేశాలను అమలు చేస్తున్నామా లేదా అనే ఆలోచిస్తున్నారు గానీ ఉ చితానుచితాల గురించి ఆలోచించడం లేదు. ఈ కారణంగానే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలుకు నోచుకోవడం లేదు. పాలనలో అరాచక ధోరణులు చొరబడినప్పుడు ఎవరికీ రక్షణ ఉండదని గమనించాలి. ఇప్పటికైనా జగన్ తన విధానాలను సమీక్షించుకుంటే ఉత్తమ సిఎంగా రాణించగలడు. ఆయనకు వయసు కూడా కలని రాగలదు. జగన్ మరి ఇలాంటి సలహాలను వినే స్థితిలో ఉన్నారా? అన్నది కాలమే నిర్ణయించాలి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి