జనవిజయంఆంధ్రప్రదేశ్మందు పెద్ద మొత్తంలో తయారీకి సాయం చేయాలంటూ సిఎం జగన్ కు లేఖ రాసిన ఆనందయ్య

మందు పెద్ద మొత్తంలో తయారీకి సాయం చేయాలంటూ సిఎం జగన్ కు లేఖ రాసిన ఆనందయ్య

నెల్లూరు, జూన్ 8(జనవిజయం): తాను ఇచ్చే మందును ప్రభుత్వమే అధికారికంగా పంపిణీ చేపడితే ప్రజలకు అందుతుందని కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య సీఎం జగన్ కు లేఖ రాశారు. ఔషధం తయారీ సామగ్రి తదితరాలకు సహకారం అందించాలని విన్నవించారు. ఎక్కువ మొత్తంలో మందును తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని ఆనందయ్య లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఒక్కో జిల్లాకి అయిదు వేల మందు ప్యాకెట్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయించాలని ఆనందయ్య కోరారు. అలాగే ఔషదం తయారీకి అవసరమైన సామగ్రి తదితరాలకు సహకారం అందించాలని కోరారు. ఎక్కువ మొత్తంలో మందు తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సైతం పంపిస్తామని ఆనందయ్య తెలిపారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని ఆనందయ్య లేఖలో కోరారు. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. సోమవారం ఆనందయ్య అందించే కె మందు పంపిణీకి సైతం హైకోర్టు అనుమతి ఇచ్చింది. గ్రామ వలంటీర్ల సహాయంతో ఆనందయ్య మందును ఇంటింటికీ పంపిణీ చేయించనున్నారు.మరో వైపు.. నెల్లూరు జిల్లాలోని మునుబోలు మండలంలో ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఈ ఔఔషధాన్ని ఇంటింటికీ చేరవేస్తున్నారు. మందు కోసం ఇతర ప్రాంతాల వారిని అనుమతించని పోలీసులు.. కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ అమలును కొనసాగిస్తున్నారు. ఆనందయ్య ఔషధంలో ఒకటైన కె రకానికి హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మందును రాష్ట్ర ప్రజలందరికీ అందజేయడానికి ప్రభుత్వం సహకారం కావాలని.. ప్రభుత్వం నుంచి తనకు సాయం అందడం లేదని ఆనందయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే సర్వేపల్లిలో రెండో రోజు మంగళవారం ఆనందయ్య మందు పంపిణీ కొనసాగుతోంది. కేవలం సర్వేపల్లి వానులకు మాత్రమే మందు పంపిణీ చేస్తున్నామని ఇతర ప్రాంతాల వారు రావద్దని ఆనందయ్య కోరుతున్నారు. త్వరలో మిగిలిన ప్రాంతాలకు పంపిణీ చేస్తామని కూడా చెప్పారు. పాజిటీవ్ వచ్చిన వారిని వాలంటీర్లు గుర్తించారు. వారికి ఈ మందు ఇస్తున్నారు. సుమారు లక్ష మందికి ఆనందయ్య మందు అందే అవకాశం ఉంది. అలాగే కరోనా రాకుండా ఉండే మందు కూడా పింపిణీకి సిద్ధం చేస్తున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి