భద్రాచలంలో ఏ.పి.ముఖ్యమంత్రి జగన్ దిష్టి బొమ్మ దగ్ధం
భద్రాచలం, 09 సెప్టెంబర్(జనవిజయం)
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టు ఖండిస్తూ తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మరియు పార్లమెంట్ అధ్యక్షులు కొండపల్లి రామచంద్రయ్య ఆదేశాల మేరకు భద్రాచలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ., 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని చంద్రుడిలా చంద్రబాబు ఉన్నారని, గత 20 సంవత్సరాల నుండి రాశేఖర్ రెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డి వరకు ఎన్నో కేసులు పెట్టినా కూడా ఏది రుజువు కాలేదని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలన పోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, లోకేష్ యువగలం యాత్రకు చంద్రబాబు యాత్రలకు స్వచ్ఛందంగా ప్రజలు లక్షల్లో వస్తున్నారని, అది చూసి సహించలేక జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ని ఒక్కరోజైనా జైలు లో పెట్టాలనే ఉద్దేశంతో అక్రమంగా అరెస్టు చేయించారని, చంద్రబాబు నాయుడు ని వెంటనే విడుదల చేయాలని భద్రాచల తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో కొడాలి శ్రీనివాస్ , షేక్ అజీమ్, ఖమ్మంపాటి సురేష్ కుమార్ , కుంచాల రాజారాం అభినేని శీను , చిట్టిబాబు , రాంబాబు, రాఘవ చారి, దాసన్న చంటి ,వెంకటేశ్వరరావు , ప్రసాద్ , అనసూయ, భాగ్యలక్ష్మి , గౌతమి, చుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.