జనవిజయంతెలంగాణఐసోలేషన్ పేషెంట్ల ఆరోగ్యం పట్ల నిరంతరం పర్యవేక్షణ-ఖమ్మం కలెక్టర్ ఆదేశం

ఐసోలేషన్ పేషెంట్ల ఆరోగ్యం పట్ల నిరంతరం పర్యవేక్షణ-ఖమ్మం కలెక్టర్ ఆదేశం

ఖమ్మం, మే24(జనవిజయం): ఐసోలేషన్ కేంద్రాలలోని పేషెంట్ల ఆరోగ్యం పట్ల నిరంతరం పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల శ్రీరామా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకటవీరయ్యతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న పేషెంట్లతో కలెక్టర్ మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించారు. గ్రామాలలో కోవిడ్ పాజిటివ్ పేషెంట్లకు తమ గృహాలలో సరియైన ప్రత్యేక వసతులు లేనటువంటి వారి కోసం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పాజిటీవ్ నిర్ధారణ అయిన వారు తమ స్వీయరక్షణతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఐసోలేషన్ వార్డులలో ఉండి వైద్య సేవలు పొందాలని కలెక్టర్ సూచించారు. ఐసోలేషన్ వార్డులోని పేషెంట్ల ఆరోగ్యం పట్ల నిరంతరాయంగా పరీక్షిస్తు అవసరమైన వైద్య సదుపాయాలను సేవలను అందించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిదుల సహాకారంతో ఐసోలేషన్ కేంద్రంలోని పెషెంట్లకు భోజన వసతులు ఏర్పాటు చేయాలని మండల స్థాయి అధికారులను కలెక్టర్ కోరారు. ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎంలు, కోవిడ్ పూర్తి రక్షణ చర్యలు పాటిస్తూ తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

అనంరతం మండలంలోని ముత్తగూడెం గ్రామం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును శాసనసభ్యులు సండ్రా వెంకటవీరయ్యతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లా సరిహద్దులోకి ప్రవేసించే అంబులెన్స్ లు, అత్యవసర వైద్య సదుపాయాల నిమిత్తం వచ్చే వారి వాహానాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లాక్ డౌన్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోను బయట జనసంచారం ఉండరాదని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారి సూర్యనారాయణ, పెనుబల్లి తహశీల్దారు రమాదేవి, ఎం.పి.డిఓ మహాలక్ష్మీ, సర్పంచ్ ఆళ్ళ ఆప్పారావు, వైద్యాధికారులు, ఏ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి