జనవిజయంతెలంగాణఐసోలేషన్ కేంద్రాలపై వైద్యాధికారుల నిరంతర పర్యవేక్షణ - కలెక్టర్ కర్ణన్ ఆదేశం

ఐసోలేషన్ కేంద్రాలపై వైద్యాధికారుల నిరంతర పర్యవేక్షణ – కలెక్టర్ కర్ణన్ ఆదేశం

ఖమ్మం, మే26 (జనవిజయం) : కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలలోని పేషెంట్ల వైద్య సేవలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ ఉదృతిని పూర్తిగా అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఆక్సిజన్ బెన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుమలాయపాలెంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో 20 పడకల ఆక్సిజన్ సదుపాయంతో ఏర్పాటు చేయడం జరిగిందని, ఆసుపత్రిలో సరిపడ రెమిడెసివర్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచామని, మండలంతో పాటు పాలేరు నియోజకవర్గ ప్రజల సౌకర్యార్ధం తిరుమలాయపాలెంలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసామని కలెక్టర్ తెలిపారు.

కోవిడ్ పాజిటీవ్ పేషెంట్లకు ఇట్టి కేంద్రంలో వైద్య చికిత్సతో పాటు ఉచిత భోజన సదుపాయం అందించేందుకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహాకరం తీసుకోవాలని ఎం.పి.డి.ఓను కలెక్టర్ ఆదేశించారు. మండలంలోని కాకరవాయి గ్రామంలో అధిక కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, లక్షణాలు కలిగిన వారికి చికిత్స అందించడంతో పాటు టెస్టు నిర్వహించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఐసోలేషన్ కేంద్రంలో పరిశుభ్రత పనులు ఎప్పటికప్పుడు ముమ్మరంగా జరగాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతీ, మండల ప్రత్యేక అధికారి అనసూయ, సర్పంచ్ కొండబాల వెంకన్న, ఎం.పి.పి మంగీలాల్, తహశీల్దారు రాజకుమార్, ఎం.పి.డి.ఓ జయరాం, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రాంబాబు, డాక్టర్ పావని, డాక్టర్ రామారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి