ఖమ్మం, జూలై 16 (జనవిజయం): ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలు చేపట్టాలని, వాటి వివరాలను వాట్సప్ ద్వారా పంపాలని వి.పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సంవత్సరానికి జిల్లాలోని గ్రామీణ, పట్టణ ఔత్సాహికులు ఆవిష్కరణలలో తమ ప్రతిభను చాటుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలు ఆవిష్కరణల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా గ్రామీణ ఆవిష్కరణ, విద్యార్థుల ఆవిష్కరణ, వ్యవసాయ రంగ ఆవిష్కరణలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఆవిష్కరణలు తదితర అంశాలు ఇందులో ప్రదర్శించవచ్చిన, వాటికి సంబంధించిన ప్రదర్శనకు గల రెండు నిమిషాల వీడియో, ఆవిష్కరణ నాలుగు ఫోటోలు, ఆరు వ్యాఖ్యలతో ఆసక్తి గల వారు 9100678543 నెంబర్‌కు వాట్సప్ ద్వారా వృత్తి, ఊరి పేరు, జిల్లా పేరుతో వివరాలను పంపించాలన్నారు. ఆవిష్కరణలు ఆగస్టు 5 లోగా పంపాల్సివుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.