జనవిజయంతెలంగాణఇంటి దగ్గరే ఈటెల - మీడియా గోల గోల

ఇంటి దగ్గరే ఈటెల – మీడియా గోల గోల

  • ఈటెలతో కోందడరాం, కొండాల భేటీ ఈటెలకు మద్దతు ప్రకటించిన నేతలు
  • ఉమ్మడిగా పోరాడుదామని పిలుపు
  • ఈటెలను టీఆర్ఎస్ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదన్న కొండా

హైదరాబాద్, మే27(జనవిజయం): మాజీ మంత్రి ఈటల రాజేందర్ వార్తలలో వ్యక్తిగా నిలిచారు. ఆయన ఏమి చేసినా, ఏమి చేయకున్నా మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో గోలగోల అవుతోంది.ఈటెల నోటి వెంట వచ్చిన మాటల ప్రకారం ఇప్పటి వరకు అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం ఈటెల కేసీయార్ వ్యూహాలకు ధీటుగా ప్రతి వ్యూహం పన్నే పనిలో ఉన్నారు. ముందు హుజూరాబాద్ లో రాజీనామా చేసి గెలిచాకనే పార్టీ పెట్టడమా, మరో పార్టీలో చేరడమా అన్నది చేయాలన్నది ఆయన ఆలోచన. ఈటెల భాజాపాలో చేరుతున్నాడనీ, నిర్ణయం దాదాపు ఖరారైందనీ, రాజ్యసభ సభ్యుడుని చేయడం ద్వార కేంద్రంలో ఈటెల సహాయ మంత్రి అవుతారని, హూజూరాబాద్ లో ఈటెల భార్య జమున పోటీ చేస్తారని, కేసీయార్ తో బిజిపి రహస్య మంత్రాంగం మానాలని ఈటెల షరతులు పెట్టారని, దానిపైన అమిత్ షా హామీ ఇవ్వలేదనీ నిన్నంతా సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా కోడై కూసింది. ఈ నేపథ్యంలో తాను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తానని బిజిపిలో చేరడం లేదని ఈటెల స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈటెల ప్రతి కదలికా వార్త గానే ఉంటోంది. కేసీయార్ సహా రాజకీయాలపై ఆసక్తి ఉన్న సామాన్యుల వరకు ఈటెలకు సంబంధించిన ప్రతి వార్తనూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈటెలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరాం గురువారం ఈటల నివాసంలో సమావేశమయ్యారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణతో పాటు నిర్ణయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈటల బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీతో ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడగట్టే యోచనలో ఈటల ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమకారులను అంతా ఒకతాటిపైకి తీసుకుని వచ్చి పోరాడాలని ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. ఇదిలావుంటే ఈటల తప్పు చేసుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీజేఎన్ అధ్యక్షుడు కోదండ రాం మాజీ మంత్రి ఈటలను శామీర్ పేట్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఈటలకు మద్దతు ఇవ్వడం కోసమే వచ్చామని కొండా అన్నారు. ఈ సందర్భంగా కొండా మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు ఇది సరైన సమయం కాదని సీఎం కేసీఆర్‌కు సూచించారు. ఈటలకు అండగా ఉంటామని కొండా తెలిపారు. ఈటలను సస్పెండ్ చేసే ధైర్యం లేదా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కక్ష సాధింపుగా ఈటల కుటుంబ సభ్యులపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని కొండా అన్నారు. కేసీఆర్ కొట్లాడాల్సింది కరొనాపై అని కొండా అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మేమంతా ఐక్యంగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు. రాజకీయ విబేధాలు ఉంటే చర్చించుకోవాలని టీజేఎన్ అధ్యక్షుడు కోదండరాం సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతులు పాటించే అలవాటు కేసీఆర్‌కు లేదని కోదండరాం అన్నారు. ఎవరైనా తన నీడన బతకాలన్నదే కేసీఆర్ నైజం అని కోదండ రాం వ్యాఖ్యానించారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి