కారేపల్లి, ఆగస్ట్10 (జనవిజయం): తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని, ఇందిరమ్మ రాజ్యంతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని టిపిసిసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధారావత్ రామ్మూర్తి నాయక్ అన్నారు. బుధవారం రాత్రి ఏఐసిసి పిలుపుమేరకు టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి తోపాటు టీపీసీసీ ఆదేశాల మేరకు కారేపల్లి మండల పరిధిలోని సీతారాంపురం ఉమ్మడి పంచాయతీలోని మడెంపల్లి పంచాయితీ మోకాళ్ళ రామయ్య గుంపులో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని పల్లెనిద్ర స్థానిక నాయకులతో కలిసి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజులతో కలిసి ఆయన మాట్లాడుతూ జల్, జంగిల్, జమీన్ అనే నినాదంతో గిరిజనుల కొరకు గిరిజన పక్షాన అనేక ఉద్యమాలు చేసిన ఉద్యమకారుడు సాయుధ పోరాట వీరుడు కొమరం భీమ్ అని ఆయన చిత్రపటానికి పూలమాలల వేసి ఘనంగా నివాళులర్పించి, గిరిజనుల కొరకు ఆయన చేసిన పోరాటాన్ని గుర్తుచేసి గిరిజనలందరికీ ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ప్రశాంతమైన వాతావరణంలో, పోడు భూములు దున్నుకుంటూ, గిరిజన బిడ్డలందరూ ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రస్తుత బీఆర్ఎస్,బిజెపి పాలనలో గిరిజన బిడ్డలు ప్రశాంతత కోల్పోయారని, పోడు భూముల సమస్యలతో నానా ఇబ్బందులు పడ్డారని, దానికి కారణమైన బీఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, గిరిజనులందరూ గమనించాలని మరల కాంగ్రెస్ పార్టీ అధికారంతోనే మన ప్రశాంతమైన జీవితం మనకు లభిస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోడు భూములకు శాశ్వత పరిష్కారం కల్పిస్తుందని, రైతులకు కౌలు రైతులకు 15 వేల రూపాయల పెట్టుబడి సాయం ఇస్తుందని,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని, వృద్ధులకు4 వేల రూపాయల పెన్షన్ ఇస్తుందని,రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తుందన్నారు.
అనంతరం గిరిజనలతో కలిసి గిరిజన సంప్రదాయ నృత్యాలను చేసి సంతోషాన్ని వ్యక్తపరిచి వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈసం రాములు,ఎంపీటీసీ భూక్యా పార్వతి,గడ్డం వెంకటేశ్వర్లు,గుండ్ల జగన్నాథం,మాజీ సర్పంచ్ ధరావత్ బద్రు నాయక్,పులసం భద్రం, ఈశాల ఛాయాదేవి,బుగ్గా సురేందర్,మోకాళ్ళ బక్కయ్య,కోటయ్య, నరసింహారావు, కోటేశ్వరరావు,దొర,పటేల్ ఆదివాసి మహిళలు,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.