ఖమ్మం, ఆగస్టు 14(జనవిజయం): 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ లు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందిగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భద్రత, బందోబస్తు, పోలీసుల కవాతు రిహార్సల్స్ తదితర ఆంశలపై అధికారులతో చర్చించారు. జెండా ఆవిష్కరణ,ముఖ్య అతిధి ప్రసంగం ఆనంతరం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను అధికారుల పర్యవేక్షణ వుండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం టౌన్ ఏసీపీ గణేష్, ఎస్బీ ఏసీపీ ప్రసన్న కుమార్,ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, తాసిల్దార్ శైలజ, ఆర్ఐ లు కామరాజు, శ్రీశైలం, తిరుపతి, సిఐలు స్వామి, సత్యనారాయణ, కుమారస్వామి, అశోక్, శ్రీధర్, సతీష్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.