జనవిజయంఆరోగ్యండబ్బు పోయినా ప్రాణాలకు దక్కని హావిూ - ఇల్లు గుల్ల చేయిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు

డబ్బు పోయినా ప్రాణాలకు దక్కని హావిూ – ఇల్లు గుల్ల చేయిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు

సామాన్యుల జీవితాలపై మహమ్మారి ప్రభావం
నిత్యవాసరాలు, మందులతో తట్టుకోలేని భారం

హైదరాబాద్‌,మే18(జనవిజయం) : కరోనా మధ్యతరగతి జీవితాలను ఆగం చేస్తోంది. అప్పు చేసి దవాఖానాలకు వెళితే ప్రాణాలు పోతున్నాయి. శవాలుగా మారి ప్రజలు వస్తున్నారు. శవాలను నేరుగా శ్మశానాలకు తరలిస్తున్నారు. శవాలను అడ్డం పెట్టుకుని చివరి వరకు రావాల్సిన రూపాయిని కూడా వసూలు చేసుకోవడంలో ఆస్పత్రుల వారు ఆరితేరారు. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టే మనుషులను పరీక్షిస్తోంది. భవిష్యత్తుపై ఆశతో పొదుపు మంత్రం పాటించేవారిని భయాందోళనలో నెట్టేస్తోంది. కరోనా ప్రవేశం తర్వాత ఖర్చు పెరగడమే తప్ప ఆదాయం లేకుండా పోయింది.

దీనికి తోడు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి కొనుక్కోలేనంతగా చేరాయి. మరోవైపు ఇంట్లో ఉంటున్న వారు కరోనా తమవరకు రాకుండా భద్రత కోసం పెట్టే ఖర్చు భారంగా మారుతోందని వాపోతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహారం చుక్కలనంటుతున్నా.. ఆసుపత్రుల బిల్లులు చూసి భయపడటం కంటే నెలనెలా ఈ ఖర్చును భరించడమే మేలని భావిస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో 30శాతం మంది బస్తీల్లో జీవనం సాగిస్తుంటే 50శాతం మందివి మధ్యతరగతి జీవితాలే. రెండేళ్లుగా ఆదాయం పెరగలేదు కానీ ఖర్చు బడ్జెట్‌ దాటిపోతున్నాయని వాపోతున్నారు. వనస్థలిపురంలో పనిచేసే పార్థసారథి అనే పూజారికి కరోనా వస్తే ఇంటిల్లిపాదికీ అంటుకుంది. ఆస్పత్రిలో చేరితే భార్య పోయింది. కొడుకు ఐసియూలో చికిత్స పొందుతున్నాడు. పైసాపైసా పోగేసిన డబ్బు మొత్తం తగులబెట్టాడు. అయినా భార్య బతకలేదు. చివరి నిముషంలో ఆస్పత్రి వారు తెలివిగా పెద్దాసుపత్రికి తీసుకుని వెళ్లమని అంబులెన్స్‌ ఎక్కించారు. లక్షలు పోసినా కనికరించలేదు. చివరకు అంబులెన్సులోనే భార్య మాధవి మృత్యువాత పడిన ఘటన సోమవారం అర్థరాత్రి జరిగింది.

ఇలాంటి అభాగ్యులు నగరంలో రోజుకు పదుల సంఖ్యలో ఉంటున్నారు. నెలవారీ అద్దె, ఇంటి ఖర్చు,ఆసుపత్రుల బిల్లులు చూసి గొల్లుమనే దౌర్భాగ్యం దాపురించింది. ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం మంచిదని అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నారు.పోషకాహారం, మందులు, ల్యాబ్‌లో పరీక్షలు, పల్స్‌ ఆక్సీవిూటర్‌ తదితరాలు కొనుగోలు చేసి ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెట్రోల్‌, గ్యాస్‌, సరకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏడాదిగా ఒక్క రూపాయి ఆదాయం పెరగలేదు. పండ్లు, మాస్కులు, శానిటైజర్‌ తదితరా ఖర్చులు అదనం. వైద్యం కోసం పెట్టే ఖర్చు కూడా పెరిగింది. దీంతో ఖర్చు తప్ప పొదుపు లేని జీవితంగా మారిపోయింది. బయట కాలుపెడితే వేలకువేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పనులు లేకుండా ఇంట్లో పడివున్నా కరోనా కాల్చుకు తింటోందని అనేకులు వాపోతున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి