Saturday, February 24, 2024
Homeపరిపాలనహుక్కా కేంద్రాలను నిషేధిస్తూ చట్టం

హుక్కా కేంద్రాలను నిషేధిస్తూ చట్టం

  • తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
  • పొగాకు ఉత్పత్తుల ప్రచరంపైనా రాష్ట్రం నిషేధం
  • ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనభ

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనవిజయం): తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హుక్కాపై నిషేధం విధించింది.  తెలంగాణలో హుక్కా కేంద్రాలను  నిషేదించే సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్‌ బాబు ప్రవేశ పెట్టగా సభ ఆమోదించింది. బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు సభకు మంత్రి శ్రీధర్‌ బాబు కృతజ్ఞతలు తెలిపారు. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సిగరెట్‌ పొగ కంటే హుక్కా మరింత హానికరమని చెప్పారు. యువతకు హుక్కా వ్యసనమయ్యే అవకాశం ఉందన్నారు. హుక్కా అనేది సిగరెట్లతో పోల్చితే వెయ్యి రెట్లు హానికరం. ఒక సిగరెట్‌తో పోల్చితే, ఒక హుక్కా సెషన్‌లో దాదాపు 125 రెట్లు పొగ, 25 రెట్లు తాగుతారు , 2.5 రెట్లు నికోటిన్‌, 10 రెట్లు కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలవుతుంది. ఒక్కసారి హుక్కాకు అలవాటు అయితే యువత దానికి బానిసలవుతారు. ఈ పోకడ ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని యువత, ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌ హుక్కాను, హుక్కా సెంటర్లను శాశ్వతంగా బ్యాన్‌ చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేసింది. హుక్కా నిషేధం బిల్లుపై సభలో ఎలాంటి చర్చ లేకుండానే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

ఈ బిల్లు రాకతో ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా సెంటర్లు క్లోజ్‌ అవ్వనున్నాయి. హుక్కా నిషేధం వెంటనే అమల్లోకి వస్తుంది. హుక్కాకు సంబంధించిన ఉత్పత్తులను కూడా అమ్మటం, కొనటం నేరంగా పరిగణించబడుతుంది. నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక కీలక బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణలో హుక్కా కేంద్రాలను నిషేధించే సవరణ బిల్లును సీఎం రేవంత్‌ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్‌ బాబు బిల్లు  ప్రవేశ పెట్టగా సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు సభకు మంత్రి శ్రీధర్‌ బాబు దన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ హుక్కా సెంటర్లపై నిషేదం అవసరమని  అన్నారు.  యువత ధూమపానానికి వ్యసనమయ్యే అవకాశం ఉందన్నారు.  పొగకంటే  హుక్కా  మరింత హానికరమని చెప్పారు.

అంతకుముందు దివగంత సభ్యలుకు శాసనసభలో సంతాపం తెలిపారు.  ఫిబ్రవరి 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనే హుక్కా నిషేధంపై  నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటించలేదు. హుక్కా అనేది సిగరెట్లతో పోల్చితే వెయ్యి రెట్లు హానికరం. ఒక్కసారి హుక్కాకు అలవాటు అయితే.. యువత బానిసలుగా మారిపోతారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని యువత, ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం. హుక్కాను.. హుక్కా సెంటర్లను శాశ్వతంగా నిషేధం విధిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. హుక్కా నిషేధంపై బిల్లును సభలో ఎలాంటి చర్చ లేకుండానే అన్ని పార్టీలు ఒకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ బిల్లు రాకతో ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా సెంటర్లు మూతపడనున్నాయి. హుక్కా నిషేధం అమల్లోకి వస్తుంది. హుక్కాకు సంబంధించిన ఎలాంటి ఉత్పత్తులను అమ్మటం, కొనటం నేరం.

సిగరెట్‌, పొగాకు సంబంధిత ఉత్పత్తులు, వినియోగానికి సంబంధించి యాడ్స్‌ అంటే ప్రకటనలను కూడా తెలంగాణ రాష్ట్రంలో నిషేధిస్తూ  ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్‌ బాబు బిల్లును ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చ లేకుండా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించినందుకు తోటి సభ్యులకు మంత్రి శ్రీధర్‌ బాబు దన్యవాదాలు తెలిపారు.  యువత ధూమపానానికి దూరంగా ఉండాలని ఇందుకు దూమపానం, పొగాకు సంబంధించి ఎలాంటి యాడ్స్‌ ను ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సోమవారం హుక్కా సెంటర్లపై నిషేదం విధిస్తూ బిల్లును ఆమోదించారు. పొగ కంటే  హుక్కా  మరింత హానికరమని మంత్రి శ్రీధర్‌ బాబు చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments