Share this:

టెలిగ్రాం వ్యవస్తాపకులు – పావెల్ దురోవ్ తన 36వ ఏట ప్రవేశించిన సందర్భంగా తనను అనుసరించేవారికోసం ‘మీకన్నా తక్కువ వయసువారిలా కనిపించడం ఎలా?’ అనే విషయాన్ని వివరించారు. ఆ విషయాలు మీకోసం:

“నేను 36వ ఏట ప్రవేశిస్తుండగా, కొంతమంది నన్ను తరచూ నేను నా వయసుకన్నా యవ్వనంగా ఎలా కనిపిస్తుంటానని అడుగుతూంటారు. నేను కూడా ఇదే విశయాన్ని చాలామందిని అడిగాను (జారెడ్ లేటొ నుండీ పాతికేళ్ళ అబ్బాయిలా కనిపించే 50 ఏళ్ళ ఒక ఫిట్నెస్ ట్రైనర్ వరకు). అందంగా, యవ్వనంగా కనిపించే చాలామంది చేసేవివి, చేయనివి ఇవి:

1. ఆల్కహాల్ తాగరు:

కొన్ని అరుదైనా సందర్భాల మినహా, ఆల్కహాల్, సంబంధిత డ్రింక్స్ తాగనివారు ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తారు.

2. ఎక్కువగా నిద్రపోవడం:

శరీరం తనని తాను బాగుపరచుకోగలిగేది నిద్రలోనే! నిద్రను అరువు తెచ్చుకోలేము: వారమంతా నిద్రపోకుండా వారాంతంలో నిద్రపోవడం వల్ల ఉపయోగం లేదు!

3. ఎక్కువగా తినొద్దు!

ఎక్కువగా తినడం వల్ల అనారోగ్యం బారీన పడడమే కాక అధిక వయసు కలిగిన వారిలా కనిపిస్తారు. నేను 6 గంటల తేడాతో రోజుకు రెండు సార్లు / ఒక్క సారి తింటాను, అదీ స్నాక్స్ వంటివి కూడా లేకుండా. రోజుకు 3కు పైగా సార్లు తినడం ఒక (చెడ్డ) అలవాటు.

4. వ్యాయామం:

అధిక బరువు కలిగి వుండటం వల్ల మనం అధిక వయసు కలిగిన వారిలా కనిపిస్తాం. వ్యక్తిగతంగా నేను కార్డియూ చేయను (దానికన్నా ఆరుబయట నడక/సైక్లింగ్/ఈత చేస్తాను). ఒక మోస్తరు వ్యాయామం, వెయిట్స్ కు ప్రాధాన్యతనిస్తాను.

5. ఒత్తిడిని తగ్గించుకోండి

మానసిక అలవాట్లు సహాయపడతాయి. ‘ఏదైనా మన మంచికే’ అనే సిద్దాంతాన్ని నమ్మడం మనకి సహాయపడుతుంది. నెగిటివ్ విజువలైజేషన్ లాంటి స్టాయిక్ టెక్నిక్స్ వల్ల ఉపయోగం వుండదు. ప్రకృతికి దగ్గరగా బ్రతకడం వల్ల మంచి అలవాట్లు ఏర్పడటంలొ సహాయపడతుంది.

6. మాంసం తినొద్దు

సముద్రాహారం, చేపలు ఓకే కానీ, మాంసం కోసం పెంచే జంతువులను యవ్వనంగా కనిపించే చాలామంది తినరు. మాంసం కోసమై ప్రత్యేకించి పెంచే జంతువులను అనారోగ్యకరమైన వాతావరణంలో పెంచడమే దీనికి కారణమని నేను అనుమానపడతాను (హార్మోన్ల మార్పు, మేత, ఇతరత్రా).

7. ఒంటరిగా బ్రతకండి

ఆశ్చర్యకరంగా, నేను కలిసిన యవ్వనంగా కనిపించిన మధ్యవయసు వారందరూ వారి జీవితంలో చాలాకాలం ఒంటరిగా బ్రతికినవారే. బహుశా వారు ఎప్పుడు నిద్రపోవాలి, ఏం తినాలి, ప్రవర్తనలు వంటివి ఇండిపెండెంట్ గా వుండటం వల్ల అయ్యుందొచ్చు. లేదా ఇది కేవలం కోరెలేషన్ కూడా అయ్యుందొచ్చు.

ఆసక్తికరంగా, పైన చెప్పిన విశయాలన్నీ శాస్త్రీయంగా కూడా వివరించబడ్డాయి (ఒక్క చివరి అంశం తప్పా).

పైన చెప్పిన విశయాలన్నింటినీ నేను గత 10 సంవత్సరాలుగా పాటిస్తున్నాను. ఇందులో నా పనుల వల్ల “ఎక్కువగా నిద్రపోవటం” అనే అంశం చాలా కష్టంగా అనిపిస్తుంది.

మీరు నా వయసులో సగమే వుండి వుండి, వీటన్నింటిలొ ఏది అన్నిటికంటే ముఖ్యం అంటే – “ఆల్కహాల్ ఎప్పుడూ తాగకండి” అని చెప్తాను. ఒక్కసారి మీరు ఆల్కహాల్ కు దూరమైతే, మీరు ఇన్నళ్ళూ గుర్తించలేని వాస్తవాన్ని గుర్తించగలుగుతారు. ఏది మంచిది, ఏది చేడ్డది అన్నది గుర్తించడం ప్రారంభిస్తారు. ప్రతీ విశయంపై ఇతరుల సలాహపై ఆధారపడకుండా, మీకు మీరుగా తెలుసుకుంటారు.”

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.