జనవిజయంఆంధ్రప్రదేశ్హేతువాద ముసుగులో మెడికల్ మాఫియాకు భజంత్రీలా? - వీరమాచనేని బహిరంగ లేఖ

హేతువాద ముసుగులో మెడికల్ మాఫియాకు భజంత్రీలా? – వీరమాచనేని బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్ హేతువాదుల సంఘం అధ్యక్షులు నార్నె వెంకటసుబ్బయ్య గారికి ప్రముఖ ఆహార నిపుణులు వీరమాచనేని రామకృష్ణ బహిరంగ లేఖ వ్రాశారు. ఆనందయ్య మందు వంటకం అంటూనే ప్రభుత్వం అనుమతినీయకూడదంటూ ద్వంద్వ ప్రమాణాలు పాటించేవారు నిజమైన హేతువాదులు కాదని తేల్చారాయన. వీరంతా హేతువాద ముసుగులో మెడికల్ మాఫియాకు భజంత్రీలు కొట్టే దొంగలని విరుచుకుపడ్డారు. ఆనందయ్య మందుకు సంబంధించి హేతువాదులమంటూ చెప్పుకుంటున్న వారు చేస్తున్న మోసపూరిత ప్రకటనలు, ద్వంద్వ ప్రమాణాలు ప్రజలకు మేలు చేసేవి కావని, మెడికల్ మాఫియాలను, అల్లోపతి పేరుతో సాగుతున్న ముఖ్యంగా డయాబెటిస్ టైప్ 2 కు జరుగుతున్న మోసపూరిత వైద్యాన్ని గురించి మీరెందుకు ప్రశ్నించరని, దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఓపెన్ డిబేట్ చేసి నిగ్గు తేలుద్దామనా ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. వీరమాచనేని రామకృష్ణ బహిరంగ లేఖను జనవిజయం పాఠకులకోసం దిగువన యథాతథంగా ఉంచుతున్నాము.

——————————

నార్నె వెంకటసుబ్బయ్య గారు, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ హేతువాదుల సంఘం వారికి నమస్కారాలతో..

మీరు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.. అందులో ఆనందయ్య ఇచ్చేది మందు కానప్పుడు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం మోసం అని తేల్చేశారు..! ఆనందయ్య “వంటకం” అని ఒక పక్క అంటూనే ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదంటారు.. ఒక వంటకానికి ప్రభుత్వం అడ్డు ఎలా పడుతుంది అన్న కనీస పరిజ్ఞానం హేతువాద ముసుగులో దాక్కొని మెడికల్ మాఫియాల కు భజంత్రీలు కొట్టే మీలాంటి వారికి లేకపోవటం శోచనీయం..

మీ బహిరంగ లేఖలో మరొక ఆణిముత్యం మెడికల్ కౌన్సిల్, ఆయుష్ దీని మూలంగా కరోనా తగ్గదు అని చెప్పారు కాబట్టి ప్రభుత్వం ఈ వంటకాన్ని నిషేదించాలి అంటున్నారు.. ఆనందయ్య వంట కరోనా మందు కాదు అని తేల్చిన ప్రభుత్వ సంస్ధల నుంచి కరోనాకు నికరంగా పనిచేసే అల్లోపతి మందు ఒక్క దాని పేరు కనుక్కొని తమరు తెలియచేస్తే తెలుసుకోవాలని ప్రజలు ఉబలాటపడుతున్నారు.. ఆ అనుమతించిన మందులు ప్రజల ప్రాణాలు ఎంత మేరకు కాపాడాయో మీ దొంగ హేతువాదులే చెప్పాలి..

ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా, ఒక మార్గదర్శనం లేకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు స్టెరాయిడ్లు కుమ్మరించిన సందర్భంలో పోయిన వాళ్ళు పోగా మిగిలిన వారిలో 12,000 మంది అమాయక డయాబెటిస్ వారు ఇంద్రధనుస్సు ఫంగస్ లతో జీవశ్చవాలుగా మిగిలారు. ఆనందయ్య మందు మూలంగా మేలు జరగకపోవచ్చు కానీ హాని లేదని ప్రభుత్వమే తేల్చింది. హాని లేని వంటకాల మీద ఎగబడే దొంగ హేతువాదులు ప్రాణాలు తోడేసాయి అని రుజువయిన మందుల మీద తమ ప్రతాపాన్ని ఎందుకు చూపలేకపోతున్నారు..??  ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు సుబ్బయ్య గారు..?

మరో అద్భుత ప్రవచనం మీ నుంచి జాలువారింది.. “ఏదైనా మందుగా గుర్తింపబడాలంటే ప్రయోగశాలలో రుజువు కావాలి. మెడికల్ కౌన్సిల్ ఆమోదం కావాలి”. మీకు ఒక సూటి ప్రశ్న.. డయాబెటిస్ టైప్ 2 కు అల్లోపతి లో చేస్తున్న ట్రీట్మెంట్ కు ఈ రూల్స్ వర్తించవా సుబ్ఫయ్య గారు..?  అనుమతులు గురించి గుండెలు బాదుకొనే మీ హేతువాదుల ముసుగులోని ముఠా కు ఒక బహిరంగ సవాల్.. గత వంద సంవత్సరాలలో మీరు చెప్పే అనుమతించిన మందులతో ఈ ప్రపంచంలో డయాబెటిస్ తగ్గిన ఒక్కడి పేరు చెప్తే మీకు 2 కోట్లు బహుమతిగా ఇచ్చి నేను ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా తప్పకుంటాను. లేదా నాకు వంద మందిని ఇవ్వండి.. వారిలో 99 మందికి తగ్గించి ఒక్కడికి రివర్స్ చేయలేకపోయినా నా తప్పు ఒప్పకొని మీకు రెండు కోట్లు బహుమతి ఇస్తాను.. దమ్ముంటే ఛాలెంజ్ కు ముందుకు రండి.. ప్రజాహితం కోసం..

అన్నం ఐతేనేమి, సున్నం అయితేనేమి రెండూ ఒకటే అని దొంగ వేదాంతం చెప్పే దొంగ సన్యాసి సున్నం పెడితే చచ్చినా తినడు. అన్నం పెడితేనే తింటాడు.. అలానే నిజాన్ని ఫేస్ చేయలేని దొంగ హేతువాదులు సైన్స్ ఛాలెంజ్ చేయదు లాంటి మంగళవారం కబుర్లు చెప్పి దులుపుకొని ఇంకో టాపిక్ వెతుక్కుంటారు తప్ప నిలబడలేరు..

తమరు వేసిన మరొక బురద మరక.. ఆనందయ్య వంటకం మందు అనుకున్న ఐదారుగురు చనిపోయారు.. అది వంట అని చెప్తూనే దాని మూలంగా చనిపోయారు అని అదే లెటర్ లో ఎలా చెప్తారు? మీకు కొన్ని ప్రశ్నలు..

1. ఆనందయ్య మందు వాడిన కోటయ్య చనిపోయారు. ఆయన ఒక్క పూట మాత్రమే ఆనందయ్య వంట వాడారు. చివరి పది రోజులు అల్లోపతి ట్రీట్మెంట్ తీసుకొంటూనే చనిపోయారు. మరి అది అల్లోపతి వైఫల్యం అవుతుంది కానీ ఆనందయ్య వంట ఎకౌంటు లో ఎలా వేస్తారు..?

2. చనిపోయిన ఐదుగురు హాస్పిటల్ లోనే చనిపోయారు. ఎవరికీ పోస్ట్ మార్టమ్ చేసి ఆనందయ్య వంట కారణంగానే చనిపోయారని తేల్చలేదు. మరి మన దొంగ హేతువాదుల ముఠా ఇది వంట కారణంగా చనిపోయినట్లు ఏ రుజువు లేకుండా ఎలా నిర్ధారించేశారు..?

3. మీరు చెప్పినట్లు ఐదుగురు నెల్లూరు హాస్పిటల్ లో ఆనందయ్య వంట కారణంగా చనిపోయారు అని ఒప్పుకుందాం.. మరి అదే ఆసుపత్రిలో ఇప్పటికి మీరు భజన చేసే మందులతో వందల మంది పిట్టల్లా రాలిపోయారు కదా..! వాటికి ఎవరు బాధ్యత వహించాలి..?

4. ఆనందయ్య మందు శాస్త్రీయంగా పని చేయదనుకున్నా కానీ ప్రజలకు ఒక భరోసా ఇస్తోంది, ఆర్ధిక దోపిడీ లేదు.. సైన్స్ భాషలో ప్లాసిబో ఎఫెక్ట్ అనుకోండి.. దీని మూలంగా భయం తగ్గి ప్రజలలో ఇమ్యూనిటీ వ్యవస్ధ సక్రమంగా పని చేయటానికి దోహదపడుతుంది కదా..! నిజానికి కరోనా వాక్సిన్లు చేసుకుంటే కరోనా రాదు అని, వచ్చినా చనిపోరు అని మీరు చెప్పగలరా..? అది కూడా ఒక నమ్మకం కలిగించే ప్లాసిబో భరోసానే ఒక రకంగా.. ఇక్కడ హాని చేసే నమ్మకాల గురించి గొంతు పెగలని హేతువాదుల ముసుగేసుకున్న ముఠా ఎలాంటి హాని లేని వాటి మీద ఎందుకు ఎగబడుతున్నారు..?

ఒక పక్క వాటర్ బాటిల్ కంటే తక్కువ రేటుకు వాక్సిన్లు అమ్ముతామని చెప్పిన మందుల కంపెనీలు వందల రెట్లు ఎక్కువ గుంజుతుంటే ఏ కలుగులో దాక్కున్నారు మన హేతువాదుల ముఠా??

కార్పోరేట్ హాస్పిటల్స్ లో రోజుకు లక్ష తీసుకొని శవాలను అప్పగించి లేదా జీవశ్చవాలుగా ఇంటికి పంపుతుంటే ప్రశ్నించటానికి హేతువాదుల గొంతులు ఎందుకు మూగపోయాయి..? మందే లేని వైద్యం కోసం కోట్ల కుటుంబాలు ఆర్ధికంగా చిధ్రమైన పెను విషాదం గురించి కిక్కుమనరెందుకు..?

అసలు ఈ రోజుకు అల్లోపతి ట్రీట్మెంట్ ప్రొటోకాల్ ఒక్కటైనా ఉందా..? ఏ మందు ఏ డోసులో, ఏ సమయంలో ఇవ్వాలి లేదా ఇవ్వకూడదు అని అత్యున్నత వైద్య సంస్ధల నుంచి రోజువారీ అప్ డేట్లు ఉన్నాయా..? ఎవరిష్టం వచ్చిన వైద్యం ప్రయోగాలు చేయబట్టే ఇన్ని మరణాలు అన్న కనీస అవగాహన మీకు ఉందా..? హైడ్రాక్సీ క్లోరోక్విన్లు, ఫావిఫెరావిర్లు, రెమెడిసివర్ లు, ప్లాస్మా ధెరఫీలు సరుకు లేనివి అని తేలిపోయాక అల్లోపతి వైద్యంలో ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలేటర్లు కాకుండా మిగిలింది విటమిన్, మినరల్స్ సప్లిమెంట్లు మాత్రమే కదా.. అంటే చివరకు మిగిలింది నేను మొదటి నుంచీ చెప్పే ఆహారం ద్వారా ఇమ్యూనిటీ మాత్రమే..

ఆనందయ్య మందు పని చేస్తుంది అని నేను సర్టిఫై చేయటం లేదు. ఆ సంగతి కాలం తేల్చుతుంది.. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఇది కరోనా మందు కాదు, తగ్గించదు అని.. గత సెప్టెంబర్ లోనే రెమెడిసివర్ పనిచేయదు అని WHO తేల్చినప్పడు కూడా ఆ విషయం జనానికి చెప్పని ప్రభుత్వాలు ఇప్పడు ఆనందయ్య వంట గురించి మాత్రం ఎందుకు చెప్పాలి??

మీ దొంగ హేతువాదుల ముఠాకు నేను గతం నుంచీ అనేక బహిరంగ సవాళ్ళను విసురుతూ వస్తున్నా తప్పించుకొని తిరుగుతున్నారు.. నిజమైన హేతువాది నిజ నిరూపణకు ఛాలెంజ్ చేస్తాడు.. ఛాలెంజ్ ను ఢీ కొడతాడు..ఛాలెంజ్ అంటే నోటికి పని చెప్పటం కాదు.. ఒక వేదిక ఏర్పరచుకొని మీ ముఠా, నా బ్రుందం అల్లోపతి నిపుణుల సమక్షంలో రిపోర్టులు, ఆధారాలతో చర్చించి ఏది ప్రజలకు మంచిదో తేల్చుదాం.. నిజమైన సైన్సు ఏదో, సైన్స్ ముసుగేసుకున్న దొంగ సైన్స్ ఏదో రుజువులతో ప్రజల ముందు పెడదాం..

ఒక నిఖార్సయిన హేతువాదిగా ప్రజాహితం కోసం నేను చేస్తున్న ఈ ఛాలెంజ్ స్వీకరిస్తారు అని ఆశిస్తున్నాను..

భవదీయుడు,
నిజమైన హేతువాది,
వీరమాచనేని రామకృష్ణ,
వాట్సప్ నెంబర్ 9246472677.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి