జనవిజయంతెలంగాణఆరోగ్యశాఖను హరీష్‌ రావుకు, కవితకు ఆర్ధిక శాఖను అప్పగిస్తారా ?

ఆరోగ్యశాఖను హరీష్‌ రావుకు, కవితకు ఆర్ధిక శాఖను అప్పగిస్తారా ?

  • ఆయనకు వరుసగా బాధ్యతలు అప్పగించడంపై అనుమానాలు
  • గాంధీ సందర్శనలోనూ కెసిఆర్‌ వెంట ఉన్న హరీష్‌
  • కవితకూ మంత్రి పదవి రాబోతుందా?

హైదరాబాద్‌,మే19(జనవిజయం): ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించడంతో ఆయన నిర్వహించిన వైద్య, ఆరోగ్యశాఖ ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ఆధీనంలో ఉంది. కరోనా కష్టకాలంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లేకపోవడంతో సీఎం కేసీఆర్‌.. ప్రస్తుతానికి ఆ శాఖ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బుధవారం గాంధీ ఆస్పత్రికి వెళ్లి కరోనా బాధితులను పరామర్శించారు. అయితే కొద్దిరోజులుగా వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన సవిూక్షల్లో సీఎం కేసీఆర్‌ మంత్రి హరీశ్‌ రావును నేరుగా పాల్గొనేలా చేస్తున్నారు. ఇటీవల కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో జరిగిన సవిూక్షలోనూ మంత్రి హరీశ్‌ రావు పాల్గొని రాష్టాన్రికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. అలాగే ఆక్సిజన్‌, బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో సిఎస్‌తో కలిసి సవిూక్షించారు. ఈ పరిణామాలను బట్టి.. త్వరలోనే మంత్రి హరీశ్‌ రావుకు వైద్య,ఆరోగ్యశాఖ ఇవ్వడం దాదాపు ఖాయమనే వాదన వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త భిన్నంగా ఉండటంతో.. హరీశ్‌ రావు ముందుగా వైద్య,ఆరోగ్యశాఖకు సంబంధించిన పలు సవిూక్షల్లో పాల్గొంటున్నారు. తరవాత మెల్లగా ఆయనకు ఈ శాఖ అప్పగించాలనే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. మరోవైపు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్న కేసీఆర్‌.. అనంతరం శాఖలకు సంబంధించి మార్పులు చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హరీశ్‌ రావుకు కీలకమైన వైద్య,ఆరోగ్యశాఖ అప్పగిస్తే.. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ఆర్థికశాఖను మరొకరికి అప్పగిస్తారా లేక అదనంగా వైద్యారోగ్య శాఖను అప్పగిస్తారా అనే చర్చ కూడా సాగుతోంది. వైద్య, ఆరోగ్యశాఖ ఎంతో కీలకం కావడం… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ శాఖతో పాటు మరో శాఖ బాధ్యతలు నిర్వహించడం కష్టమనే అభిప్రాయం కూడా ఉంది. ఈ కారణంగానే హరీశ్‌ రావుకు వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు అప్పగించి ఆర్థికశాఖను మరొకరికి అప్పగించడమో లేక ఆ శాఖను తన దగ్గరే పెట్టుకోవడమో సీఎం కేసీఆర్‌ చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏ శాఖను అప్పగించినా.. దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరున్న హరీశ్‌ రావు.. వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు తీసుకుంటే.. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలతో పాటు ఆరోగ్య రంగం మరింత మెరుగుపడుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే కవితను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్‌ ఉందన్న వాదనలూ ఉన్నాయి. అప్పుడు ఆర్ధిక శాఖ బదిలీ కూడా జరగవచ్చని అంటున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి