జనవిజయంజాతీయంహేట్సాప్ సి.పి.ఎం!....... కేరళలో అంతా కొత్తవారే మంత్రులు!!

హేట్సాప్ సి.పి.ఎం!……. కేరళలో అంతా కొత్తవారే మంత్రులు!!

కొత్తవారికోసమే శైలజను పక్కన పెట్టాం: సీతారామ్ ఏచూరి

తిరువనంతపురం,మే20(జనవిజయం): పినరయ్‌ విజయన్‌ నూతన కేబినెట్‌లో కేకే శైలజకు చోటు దక్కకపోవడంపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ వివరణ ఇచ్చారు. కేవలం కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే పాతవారిని పక్కన పెట్టామని అన్నారు. రాష్ట్రం, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కేబినెట్‌లోకి కొత్త వారికి అవకాశం ఇచ్చామని ఆయన తెలిపారు. కేరళ ముఖ్యమంత్రిగా పినరయ్‌ విజయన్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ హాజరయ్యారు. ఎవరికి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వాలి, ఎమ్మెల్యేగా విజయం సాధించిన వారిలో ఎవరికి మంత్రిగా అవకాశం కల్పించాలన్న విషయం పూర్తిగా ఆయా రాష్టాల పార్టీ కమిటీ చేతుల్లో ఉంటుందని, ఈ నిబంధనలు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని ఏచూరి వివరించారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు సీపిఎం నిర్ణయాన్ని తప్పు పడుతూ పోస్టులు పెట్టారు. గత ఆరోగ్య మంత్రిగా పనిచేసిన శైలజ టీచర్ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందారు. ముఖ్యంగా కోవిడ్ విషయంలో మహిళా టీమ్ ల ఆధ్వర్యంలో ఆమె అందరి అంచనాలకు మించి పనిచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మన్ననలు కూడా పొందారు. అటువంటి శైలజ ను మంత్రి పదవిలోకి తీసుకోకపోవడం పట్ల చాలామంది విమర్శలు చేశారు. అయితే పార్టీ ముందుగానే తీసుకున్న నిర్ణయాన్నే సీపీఎం అమలు చేసింది. మంత్రులు, ముఖ్యమంత్రులు తమ వారసులకోసం పనిచేస్తున్న ఈ రోజులలో కేరళ సీపీఎం సాహసోపేతంగా అందరూ కొత్తవారినే మంత్రులుగా నియమించడం ఆశ్చర్యకరమైన విషయం. ఏమైనా ఈ రోజులలో, ఇప్పటి రాజకీయాలలో ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం, దానిని అమలులలో పెట్టడం…… నిజంగా అబినందనీయం. హేట్సాప్ సీపీఎం.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి