ఘనంగా బి.ఆర్.ఎస్ పార్టీ లీడర్ హరితక్క జన్మ దిన వేడుకలు
మహబూబాబాద్, 9 ఆగస్ట్( జనవిజయం ):
మహబూబాబాద్ ఎం.పి కవితక్క యూత్ ఫోర్స్ సభ్యుల ఆధ్వర్యంలో బి.ఆర్.ఎస్ పార్టీ లీడర్ కటికనేని హరితక్క జన్మ దిన వేడుకలను బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలో ని ఓ వికలాంగుల దంపతులకు జీవనోపాధి దృష్ట్యా ఓ చిరువ్యాపారం పెట్టించారు.ఈ విషయమై ఆ దంపతులు స్పందిస్తూ..హరితక్క జన్మ దినోత్సవ సందర్భంగా ఎం.పి కవితక్క ఫోర్స్ సభ్యులు వారికి చేసిన సహాయం వాళ్ళ జీవితానికి ఓ మార్గం అని తెలిపారు.అనంతరం కవితక్క ఫోర్స్ సభ్యులు అనాధాశ్రమానికి వెళ్లి అక్కడ హరితక్క బర్త్డే కేక్ కట్ చేసి అనాధ పిల్లలకు నిత్యావసర సరుకులు అందించారు.తదుపరి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలకి వెళ్లి అక్కడ ఉన్న పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు,పెన్సిల్స్ మరియు తదితర వస్తువులు అందజేశారు అంతేకాదు ఓ రెండు పేద కుటుంబాలకు ఓ బస్తా బియ్యాన్ని మరియు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఎం.పి కవితక్క యూత్ ఫోర్స్ సభ్యులు మనది రాజేష్ మాట్లాడుతూ., ఒకే రోజు పలు కార్యక్రమాల ద్వారా హరితక్క జన్మ దిన వేడుకలలో భాగంగా పేదవారికి సేవ చేయడం ఆ భవగంతినికి సేవ చేసినట్లు గానే ఉందని తెలిపారు.
ఆర్య వైశ్య మహా సభ పి.ఎస్.టి ల ఆధ్వర్యంలో

ఆర్య వైశ్య మహా సభ ఆధ్వర్యంలో బి.ఆర్.ఎస్ లీడర్ హరితక్క జన్మ దిన వేడుకలను పట్టణంలో ఘనం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు వందల మందికి అన్నదాం కార్యక్రమం నిర్వహించారు.